నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలయ్య బాబు సరికొత్త గెటప్పులతో ఆడియెన్స్ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. మిక్సిడ్ టాక్ అందుకున్న రూలర్ నందమూరి అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది.

ఫ్యాన్స్ కి నచ్చిన ఫైట్స్ తో స్టెప్పులతో బాలయ్య బాగానే ఎట్రాక్ట్ చేశాడు.  అయితే సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం అనుకున్నంతగా బాలకృష్ణ అనుకున్నంతగా సత్తా చాటలేకపోయారు. మాస్ ఏరియాల్లోనే కలెక్షన్స్ ఎక్కువగా అందుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు 4కోట్లకు పైగా షేర్స్ అందించిన రూలర్ ఓవర్సీస్ లో మాత్రం దారుణమైన ఓపెనింగ్స్ ని అందుకుంది.

బోల్డ్ సీన్లకు రెడీ.. 41ఏళ్ల హీరోయిన్ హాట్ కామెంట్స్!

బాలకృష్ణ గత సినిమాల కంటే కూడా చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.  అమెరికాలో కేవలం 23 వేల డాలర్స్ మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో యూఎస్ లో మొదటిసారి బాలకృష్ణ సాలిడ్ కలెక్షన్స్ అందుకున్నాడు. ఏ తరువాత ప్రతిసారి బాలయ్య సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయితే పెట్టినపెట్టుబడికి తగ్గట్టుగా డాలర్స్ వచ్చేవి.

కానీ రూలర్ ని ప్రవాసులు ఎక్కువగా పట్టించుకోలేదు. మొదట కొనడానికి కూడా ఎవరు ముందుకు రాలేదని టాక్ వచ్చింది. ఇక రిలీజ్ అనంతరం సినిమా డివైడ్ టాక్ తో యూఎస్ కలెక్షన్స్ ని మిస్ చేసుకుంది. క్రిస్మస్ సెలవులు సినిమాకు ఏమైనా కలిసొస్తాయో లేదో చూడాలి మరి. మరి. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాను కెఎస్.రవికుమార్ డైరెక్ట్ చేయగా చినంతన్ భట్ సంగీతం అందించారు.

జూ.ఎన్టీఆర్ పైనే ఆశలు.. అప్పుడైనా జోరు పెరుగుతుందా