దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్ని వివాదాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని వర్మ పూర్తిగా లక్ష్మీ పార్వతి కోణంలో నందమూరి ఫ్యామిలీకి వ్యతిరేకంగా చిత్రీకరించాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో రంగస్థలం ఆర్టిస్ట్ పి. విజయ్ కుమార్ నటించారు. 

విజయ్ కుమార్ ని అచ్చు ఎన్టీఆర్ లాగే వర్మ చూపించాడు. అతడి నటన, ఆహార్యం కూడా ఎన్టీఆర్ ని తలపించాయి. ఇదిలా ఉండగా విజయ్ కుమార్ కుటుంబం అనుకోని కష్టాల్లో చిక్కుకుంది. విజయ్ కుమార్ సతీమణి క్యాన్సర్ బారీన పడ్డారు. దీనితో ఆమెని హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. 

విజయ్ కుమార్ ఫ్యామిలీ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంగతి తెలుసుకున్న బాలకృష్ణ విజయ్ కుమార్ ఫ్యామిలీని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అతడి భార్యకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేలా బాలయ్య చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

పోర్న్ చిత్రాల నటికి రూ.90 కోట్లు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు!

దీనితో బాలకృష్ణపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోమారు బాలయ్య తన మంచి మనసుని చాటుకున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య చివరగా నటించిన చిత్రం రూలర్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శత్వంలో బాలకృష్ణ నటిస్తున్నారు. 

శ్రీదేవి మృతికి అసలు కారణం ఇదా? బయటపడ్డ నమ్మలేని నిజం!

సరిలేరు ప్రీరిలీజ్: నన్ను అన్నేసి మాటలు ఎందుకు తిట్టావ్ విజయశాంతి: చిరంజీవి!