అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ వంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది. దర్శకుడు సందీప్ వంగాకు ఈ చిత్రం తిరుగులేని గుర్తింపు తీసుకువచ్చింది. ప్రొఫెషనల్ గా సందీప్ వంగా ప్రస్తుతం హాట్ షాట్ డైరెక్టర్. 

సందీప్ వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషాలు వెల్లివిరిశాయి. తాజాగా సందీప్ వంగ మరోసారి తండ్రయ్యాడు. సందీప్ సతీమణి మనీషా రెడ్డి ఈ మధ్యాహ్నం పండండి అమ్మాయికి జన్మనిచ్చింది. అందుతున్న సమాచారం మేరకు తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. 

తమ జీవితాల్లోకి ఆడబిడ్డ రావడంతో సందీప్ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. సందీప్, మనీషా 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సందీప్, మనీషాలకు రెండో సంతానంగా పాప జన్మించింది. 

మూడు రెట్లు నష్టపరిహారం.. త్రివిక్రమ్ కు చుక్కలు చూపిస్తున్న 'మైత్రి' ?

సందీప్ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. హిందీ రీమేక్ కు కూడా సందీప్ దర్శత్వంలోనే తెరకెక్కింది. షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సందీప్ వంగ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాల్సి ఉంది. 

ఛాన్సుల్లేని హీరోయిన్లకు పడుకోవడమే మార్గమా.. హీరోయిన్ హాట్ కామెంట్స్