మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే త్రివిక్రమ్ అల వైకుంఠపురములో చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. త్రివిక్రమ్ ని ఇటీవల ఎక్కువగా కాపీ వివాదాలు వెంటాడుతున్నాయి. అల వైకుంఠపురములో చిత్రం విషయంలో కూడా అలాంటి వివాదాలు తెరపైకి వచ్చాయి. 

ఇదిలా ఉండగా త్రివిక్రమ్, మైత్రి మూవీ మేకర్స్ మధ్య ఓ వివాదం చాలా రోజులుగా కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా ఎదిగింది. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఓ చిత్రం చేసేందుకు చాలా రోజుల క్రితం మైత్రి సంస్థ అడ్వాన్స్ ఇచ్చిందట. కానీ త్రివిక్రమ్ కు హారిక అండ్ హాసిని సంస్థ హోమ్ బ్యానర్ లా మారిపోయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ సంస్థకు తప్ప మరెవరికి సినిమా చేయడం లేదు. దీనితో తమ అడ్వాన్స్ ని నష్టపరిహారంతో కలసి మూడు రెట్లు తిరిగి చెల్లించాలని మైత్రి డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

రెండు వరుస హిట్లు.. బంపర్ ఆఫర్ కొట్టేసిన భీష్మ డైరెక్టర్

ఈ వివాదాన్ని సెటిల్ చేయడానికి హారిక అండ్ హాసిని రాధాకృష్ణ మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రెట్ల వరకు తాము చెల్లిస్తామని.. ఈ ఇష్యూకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని రాధాకృష్ణ మైత్రిని కోరారట, అందుకు మైత్రి సంస్థ ససేమిరా అంటున్నట్లు టాక్. మరి ఈ వివాదాన్ని ఎవరు పరిష్కరిస్తారో చూడాలి.