నచ్చావులే, స్నేహితుడా లాంటి హిట్ చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది మాధవి లత. ఆ తర్వాత మాధవి లతకు సరైన సక్సెస్ లేకపోవడంతో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం మాధవి లత సినిమాలకు దూరమై పూర్తిగా రాజకీయాలకు పరిమితమైంది. ఆ మధ్యన టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి మాధవి లత చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 

తరచుగా మాధవి లత తన సోషల్ మీడియాలో రాజకీయ అంశాలు, సినిమా, సామాజిక పరమైన అంశాలపై స్పందిస్తోంది. ఎలాంటి బెదురు లేకుండా తాను చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా చెబుతోంది మాధవి లత. తాజాగా మాధవి లత మరోసారి సంచలన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా నిలిచింది. 

తనకు అవకాశాలు లేవని.. సినిమాలు చేయనప్పటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని చాలా మంది తనని ప్రశ్నిస్తున్నారని మాధవి లత తెలిపింది. అలాంటి వాళ్లకు అసలు సిగ్గు ఉందా అని మాధవి లత ప్రశ్నించింది. అసలు మీ ఉద్దేశం ఏంటి. అంటే అమ్మాయిలకు ఛాన్సులు లేకుంటే పడుకోవడం మాత్రమే మార్గమా.. లేకుంటే డబ్బు సంపాదించలేరా.. మీరు మారి చావండ్రా అంటూ మాధవి లత ఘాటుగా బదులిచ్చింది. 

నితిన్ కోసం వస్తున్న మెగా హీరో.. క్రేజీ న్యూస్!

సినిమాలు శాశ్వతం కాదనే విషయం నాకు తెలుసు. అందుకే వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నా. అమ్మాయిలకు ఇలాంటి ప్రశ్నలు వేసే ముందు మీరు ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఆలోచించండి. మేము కూడా చదువుకున్నాం.. మా కాళ్లపై మేం నిలబడగలం అని మాధవి లతా పేర్కొంది. అంతే కానీ చెడు మార్గాల ద్వారా తాను డబ్బు పొందడం లేదని తెలిపింది.