సౌత్ లో అనుష్క హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. అనూష్కలాగా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించే హీరోయిన్లు టాలీవుడ్ లో చాలా తక్కువ. లేడి ఓరియెంటెడ్ చిత్రం అయినా. గ్లామర్ పాత్ర అయినా సరే అనుష్క అదరగొట్టేస్తుంది. బాహుబలి చిత్రంతో అనుష్క దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. 

కానీ ఊహించని విధంగా అనుష్క బాహుబలి తర్వాత సినిమాల వేగం బాగా తగ్గించేసింది. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. బాహుబలి తర్వాత అనుష్క చేసిన చిత్రం భాగమతి ఒక్కటే. ప్రస్తుతం నిశ్శబ్దం చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ జనవరిలో రిలీజ్ కానుంది. 

ఇదిలా ఉండగా విక్టరీ వెంకటేష్ తన సోదరుడు సురేష్ బాబు నిర్మాణంలో అసురన్ తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన అసురన్ చిత్రంలో ధనుష్ హీరోగా నటించాడు. 

సైకోలు, వ్యభిచారులే బెటర్.. పవన్ పై ఫేక్ ట్వీట్, విరుచుకుపడ్డ పూనమ్ కౌర్!

అసురన్ తెలుగు రీమేక్ కోసం వెంకటేష్ సరసన హీరోయిన్ గా అనుష్కని సంప్రదించారట. కానీ అనుష్క ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అనుష్క ఈ చిత్రాన్ని వదులుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. కానీ అనుష్క ఈ చిత్రాన్ని ఎందుకు రిజెక్ట్ చేసిందనే విషయంపై పూర్తి క్లారిటీ లేదు. 

అభిమాని మృతి: నివాళులర్పించిన చిరంజీవి, అల్లు అర్జున్.. ఫొటోస్!

నిశ్శబ్దం చిత్రానికి ముందు అనుష్క బరువు తగ్గేందుకు విదేశాలకు వెళ్ళింది. అక్కడ ఆయుర్వేద చికిత్సతో నాజూగ్గా మారింది. రీసెంట్ గా మళ్ళి అనుష్క కాస్త బొద్దుగా మారి కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. భాగమతి చిత్రం తర్వాత అయితే అనుష్క ఇకపై సినిమాలకు దూరం కాబోతోంది అంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని అనుష్క అప్పట్లో ఖండించింది. 

అఫీషియల్: 13 ఏళ్ల తర్వాత మెగాస్టార్ తో మణిశర్మ.. ఇక మాసు మరణమే!