హీరోయిన్ పూనమ్ కౌర్ తరచుగా వార్తల్లో నిలుస్తుండడం చూస్తూనే ఉన్నాము. పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో సామజిక అంశాలపై స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దిశ సంఘటన జరిగినప్పుడు కూడా పూనమ్ కౌర్ కన్నీరు పెట్టుకుంటూ నిందితులని దూషించింది. 

ఇక పూనమ్ కౌర్ పరోక్షంగా కొందరి గురించి ట్వీట్స్ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. కొన్ని అంశాలలో తనకు సంబంధం లేకున్నా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించినట్లుగా పరోక్షంగా ఉన్న ఓ ట్వీట్ వైరల్ అయింది. 

ఆ ట్వీట్ లో.. దిశకు తెలంగాణ పోలీసులు న్యాయం చేశారు. అలాగే నాతో పాటు కొంత మంది అమ్మాయిలని మోసం చేసిన సినీరాజకీయ ప్రముఖుల్ని కూడా శిక్షించాలి. రెండు బెత్తం దెబ్బలు ప్లీజ్ అని ఉంది. 

వాస్తవానికి అది ట్వీట్ కాదు. కొందరు వ్యక్తులు ఫోటో షాప్ ద్వారా ఆ ఫేక్ ట్వీట్ ని సృష్టించి వైరల్ చేశారు. ఈ ట్వీట్ పూనమ్ కౌరే చేసి డిలీట్ చేసిందని నమ్మించారు. ఆ వార్త కాస్త రచ్చ రచ్చగా మారడంతో పూనమ్ కౌర్ స్పందించింది. అది ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇవ్వడమే కాదు.. ఇలాంటి వార్తలు సృష్టించే వారిపై విరుచుకుపడింది. 

ఎన్నికలు ముగిశాయి. ఇకనైనా ఇలాంటి దుష్ప్రచారం ఆపండి, ఫేక్ న్యూస్ వైరల్ చేయడం మానుకోండి. ఎన్నికల సమయంలో నాకు నా కుటుంబానికి చాలా నష్టం చేశారు. ఇకపై ఇలాంటి పనులు చేయవద్దు. కొంతమంది పనిగట్టుకుని ఫేక్ న్యూస్ సృష్టించే కుట్ర పన్నుతున్నారు. 

సైకోల్లా ప్రవర్తిస్తున్నారు. ఇలా అసత్య ప్రచారం చేసేవారికంటే వ్యభిచారులే నయం అని పూనమ్ కౌర్ దుమ్మెత్తి పోసింది. కొంతమంది పనిగట్టుకుని నన్ను టార్గెట్ చేస్తూ చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నారు అని పూనమ్ కౌర్ తెలిపింది. సోషల్ మీడియా వచ్చాక ఫేక్ న్యూస్ లు ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే.