ఈ సంక్రాంతికి కావలసినంత ఎంటర్టైన్మెంట్ తో థియేటర్స్ లో సినిమాలు రెడీ అయిపోయాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, రజనీకాంత్ దర్బార్, కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజవుతున్నాయి. 

జనవరి 11న సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల కాబోతోంది. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తొలిసారి తెరకెక్కిన చిత్రం ఇది. ఇక 13 ఏళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ గమనిస్తే విజయశాంతిలో ఎలాంటి మార్పు లేదు.. అదే పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ తో ఆమె అదరగొడుతోంది. 

ఈ చిత్రంలో విజయశాంతి ప్రొఫెసర్ భారతిగా నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ రష్మిక మందన్న సరిలేరు నీకెవ్వరు మూవీ గురించి ఆసక్తికర విశేషాలు తెలియజేశారు. ఈ చిత్రంలో రష్మిక, సీనియర్ నటి సంగీత పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని అనిల్ రావిపూడి అన్నారు. 

న్యూడ్ ఫోటోలు అమ్ముతున్న మోడల్.. రూ.5 కోట్ల కలెక్షన్, ప్రశంసల వర్షం!

ట్రైన్ ఎపిసోడ్ లో రష్మిక, సంగీత పెర్ఫామెన్స్ తో ఉతికారేశారని అనిల్ రావిపూడి కామెంట్స్ చేశాడు. తాను ఈ చిత్రంతో ప్రేక్షకులని మ్యాజిక్ చేసి హిట్టు కొట్టాలని అనుకోవడం లేదని అన్నారు. ఈ చిత్రంలో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రేక్షకుల ఎంజాయ్ చేస్తారు. 

క్రేజీ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి.. అనారోగ్యమా?

మహేష్ బాబు గత నాలుగేళ్లలో ఇలాంటి మాస్ రోల్ చేయలేదు. ఆర్మీ అధికారిగా మహేష్ నటన ఆకట్టుకుంటుంది. దేశభక్తిని సంబంధించిన అంశాలు ఉంటూనే.. అదే స్థాయిలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని అనిల్ తెలిపారు. ఈ సంక్రాంతికి మేమైతే పాస్.. ప్రేక్షకులు 80 మార్కులు వేస్తారా.. 90 మార్కులు వేస్తారా అనేది వేచి చూడాలని అనిల్ అన్నారు. 

బండ్ల గణేష్ నెక్స్ట్ టార్గెట్ అదేనా.. పబ్లిక్ గా కామెంట్స్!