కొంత మంది ప్రముఖులు తీసుకునే నిర్ణయాలు వింతగా అనిపించినప్పటికీ.. వాళ్లంతా గొప్ప ఆశయం కోసం పరితపిస్తుంటారు. కొంత మంది మోడల్స్ పబ్లిసిటీ కోసం సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తమ అభిమాన జట్టు మ్యాచ్ నెగ్గితే న్యూడ్ షో చేస్తామని చాలా మంది మోడల్స్ బహిరంగంగా కామెంట్స్ చేశారు. అవి విధంగా మారాయి. 

కానీ అమెరికాకు చెంసిన కాయిలెన్ వార్డ్ అనే మోడల్ సంచలన ప్రకటన చేసింది. ప్రకటన చేయడమే కాదు.. తాను అనుకున్న పని చేసి చూపుతోంది. ఇంతకీ ఎం జరిగిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళదాం.. 

అమెజాన్ అడవులలో రగిలిన కార్చిచ్చు ఘటన మరచిపోకముందే.. ఆస్ట్రేలియా అడవులని కూడా భారీ స్థాయిలో ఎగసి పడుతున్న మంటలు నాశనం చేస్తున్నాయి. ఈ మంటల్ని అదుపు చేసేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. నిధులన్నీ ఖర్చు చేస్తోంది. ఈ మంటల్ని అదుపు చేసేందుకు తన వంతు సాయం చేయాలని కాయలెన్ వార్డ్ నిర్ణయించుకుంది. అందు కోసం తన అభిమానులకు ఓ ప్రకటన చేసింది. 

తనకు 10 డాలర్లు డొనేట్ చేసే వారికి ఒక న్యూడ్ పిక్ పంపుతానని తెలిపింది. ఇలా తన న్యూడ్ ఫొటోస్ తో వచ్చిన మొత్తాన్ని ఆస్ట్రేలియా అడవుల మంటలు అదుపు చేసేందుకు విరాళంగా అందిస్తానని తెలిపింది. జనవరి 4న కాయిలెన్ ఏ ప్రకటన చేయగా నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. కేవలం 2 రోజుల్లోనే 7 లక్షల డాలర్లు(సుమారు రూ.5 కోట్లు) తన న్యూడ్ ఫొటోస్ కు వసూలు అయినట్లు ప్రకటించింది. 

బండ్ల గణేష్ నెక్స్ట్ టార్గెట్ అదేనా.. పబ్లిక్ గా కామెంట్స్!

తనకు 10 డాలర్లు పంపడంతో పాటు.. అందుకు ప్రూఫ్ కూడా పంపితేనే తన న్యూడ్ పిక్ పంపుతానని కాయిలెన్ తెలిపింది. దీనితో నెటిజన్లు ఎగబడుతున్నారు. కాయిలెన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఒక మంచి పని కోసం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ ఇన్స్టాగ్రామ్ సంస్థ మాత్రం నిబంధనలకు విరుద్ధం అంటూ ఆమె ఖాతాని బ్లాక్ చేశారు. 

అమెజాన్ అడవులలో మంటలు ఎగసిపడ్డప్పుడు టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో దాదాపు 36 కోట్ల విరాళం అందించాడు. మరికొందరు సెలెబ్రిటీలు కూడా బ్రెజిల్ ప్రభుత్వానికి విరాళాలు అందించారు.