టాలీవుడ్ లో చిన్న రోల్స్ చేసుకునే స్థాయి నుంచి బండ్ల గణేష్ కెరీర్ ప్రారంభించాడు. ఆంజనేయులు చిత్రంతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్.. గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ నిర్మాతగా మారిపోయాడు. పవన్, ఎన్టీఆర్, రాంచరణ్, రవితేజ, అల్లు అర్జున్ లాంటి టాలీవుడ్ అగ్ర హీరోలతో బండ్ల గణేష్ సినిమాలు నిర్మించాడు. 

గత ఏడాది బండ్ల గణేష్ రాజకీయంగా హాట్ టాపిక్ గా నిలిచాడు. రాజకీయాల్లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. రాజకీయాల్లో ఓటమి తర్వాత గణేష్ సైలెంట్ అయిపోయాడు. త్వరలో గణేష్ నటుడిగా ప్రేక్షకులని అలరించబోతున్నాడు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో బండ్ల గణేష్ ఫన్నీ రోల్ లో కనిపించబోతున్నాడు. ట్రైన్ ఎపిసోడ్ లో బండ్ల గణేష్ పాత్ర ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు సరే.. మరి నిర్మాతగా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల బండ్ల గణేష్ సినిమా లావాదేవీలకు సంబంధించిన ఓ వ్యవహారంలో అరెస్ట్ కావడం కూడా జరిగింది. దీనితో బండ్ల గణేష్ ఇక నిర్మాతగా సినిమాలు చేస్తాడా చేయడా అనే అనుమానాలు నెలకొని ఉన్నాయి. 

తాజాగా సమాచారం మేరకు బండ్ల గణేష్ మెగాస్టార్ చిరంజీవితో ఓ చిత్రాన్ని నిర్మించే సన్నాహకాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీలో బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేశాడు. మెగాస్టార్ తో కూడా ఓ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో గణేష్ ఉన్నట్లు తెలుస్తోంది. 

చాలా మంది మా నాన్న డబ్బులు కొట్టేశారని అంటారు.. స్టేజ్ పై ఏడ్చేసిన అల్లు అర్జున్!

ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్ర మెగా సూపర్ ఈవెంట్ లో బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని బలంగా కోరుకున్న వ్యక్తిని తానే అని అన్నాడు. కానీ ఆయన మాత్రం నన్ను మరచిపోయారు.. అని సినిమాలు వాళ్ళ అబ్బాయికే చేస్తున్నారు అని సరదాగా బండ్ల గణేష్ కామెంట్స్ చేశాడు. బండ్ల గణేష్ తో భవిష్యత్తులో సినిమా చేయడానికి చిరు అంగీకరించారని.. అందుకే గణేష్ ఇలా పబ్లిక్ లో వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. 

కష్టాల్లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడు.. ఆదుకున్న బాలకృష్ణ!