లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు చిత్రంతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పరాజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి. పటాస్ చిత్రం నుంచి ఎఫ్ 2 వరకు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రాలన్నీ సక్సెస్ అయ్యాయి. 

దీనితో ఈసారి మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అనిల్ అందుకున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నేరుగా ప్రచార కార్యక్రమాలలోకి దిగేసింది. తాజాగా విజయశాంతి, దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన రీఎంట్రీ గురించి, ఈ చిత్రంలో తన రోల్ గురించి విజయశాంతి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

తాను ఇక సినిమాల్లో నటించకూడదు అని ఫిక్స్ అయి ఉన్న సమయంలో అనిల్ రావిపూడి ఓ చిత్రం కోసం సంప్రదించాడు. ఆ చిత్రానికి నేను ఒప్పుకోలేదు. అసలు నాకు నటించే ఉద్దేశమే లేదని చెప్పేశా. ఆ తర్వాత మళ్లీ సరిలేరు నీకెవ్వరు చిత్ర కథతో నా వద్దకు వచ్చాడు. ఆ టైంలో కూడా నాకు నటించే ఆలోచన లేదు. చేయనని చెప్పేశా. కానీ అనిల్ మాటిమాటికీ అడుగుతుండడంతో అతడిని హర్ట్ చేయకూడని అనుకున్నా. 

కథ వింటానని చెప్పా. కథ విన్న తర్వాత చాలా బావుందనిపించింది. బావున్న కథని బాగాలేదని అబద్దం చెప్పకూడదు. నా రోల్ కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే అంగీకరించినట్లు విజయశాంతి అన్నారు. ఈ చిత్రంలో తన పాత్ర ప్రతిఘటన మూవీ తరహాలో పవర్ ఫుల్ గా ఉంటుందని అన్నారు. 

పాయల్ రాజ్ పుత్ అందాల హొయలు.. వైరల్ అవుతున్న ఫొటోస్!

ఇక అనిల్ రావిపూడి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కొన్ని పాత్రలకు కొందరు నటులే సరిపోతారు. వారు నటించినప్పుడే మ్యాజిక్ ఉంటుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు, విజయశాంతి పాత్రలు అలాంటివే. ఈ చిత్రంలో ఎలాగైనా వియజయశాంతి గారే నటించాలని పట్టుబట్టా. చివరకు సాధించా అని అన్నారు. 

సూసైడ్ చేసుకుంటా అంటూ స్టార్ హీరో అభిమాని బెదిరింపులు!

మొదట విజయశాంతి గారిని రాజా ది గ్రేట్ మూవీ కోసం కలిశానని అనిల్ తెలిపాడు. ఆ చిత్రానికి ఆమె అంగీకరించలేదు. ఇక సరిలేరు నీకెవ్వరులో ఆమె కచ్చితంగా నటించాల్సిందే అని పోరాడా. మూడుసార్లు కథ వినడానికి కూడా ఒప్పుకోలేదు. నాల్గవసారి కథ విన్నారు.. అంగీకరించారు అని అనిల్ తెలిపాడు. 

మహేష్ బాబు, విజయశాంతి కనిపిస్తే అంతే.. ట్రైన్ లో 30 నిమిషాలు!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. అనిల్ సుంకర, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.