సౌత్ క్రేజీ హీరోయిన్ అమలాపాల్ కమర్షియల్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల కమర్షియల్ చిత్రాలని తగ్గించిన అమలాపాల్ లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. బోల్డ్ రోల్స్ అయినప్పటికీ ప్రాధాన్యత ఉంటే ఎంతటి సాహసానికైనా అమలాపాల్ వెనకడుగు వేయడం లేదు. 

గత ఏడాది అమలాపాల్ ఆమె అనే చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఇక అమలాపాల్ వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని 2014లో ప్రేమ వివాహం చేసుకుంది. కానీ కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీనితో అమలాపాల్, విజయ్ లు 2017 లో విడాకులు తీసుకుని విడిపోయారు. 

యాంకర్ మంజూష హాట్ ఫోటోస్.. గ్లామర్ ఫోజులు చూశారా !

అప్పటి నుంచి అమలాపాల్ సింగిల్ గానే ఉంటోంది. విజయ్ ఇటీవల ఓ డాక్టర్ ని రెండో వివాహం చేసుకున్నాడు. అమలాపాల్ మాత్రం తన సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా తమిళ సినీ వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు అమలాపాల్ మరోసారి ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. 

ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో సింగర్ గా అవకాశాలు అందుకుంటున్న భవనిందర్ సింగ్ అనే యువకుడి ప్రేమలో అమలాపాల్ పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అమలాపాల్ ముస్లిం యువతిలా డ్రెస్ వేసుకున్న ఫోటో.. భావనిందర్ సింగ్ ని కౌగలించుకుని ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ.. ఆ ఒక్కపని చేస్తే.. జబర్దస్త్ లో సెటైర్లు

ఈ ఫొటోల్లో ఉన్నది అమలాపాలేనా అనేది స్పష్టంగా తెలియడం లేదు. అమలాపాల్ కూడా తన ప్రేమపై ఎక్కడా మాట్లాడలేదు. విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న అమలపాల్ కు తోడు దొరికింది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో వేచి చూడాలి.