రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ.. ఆ ఒక్కపని చేస్తే.. జబర్దస్త్ లో సెటైర్లు

First Published 10, Mar 2020, 7:50 PM IST

జబర్దస్త్ నుంచి నాగబాబు వైదొలిగినప్పటికీ రోజా కొనసాగుతోంది. నాగబాబు తప్పుకున్నాక రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ జబర్దస్త్ ని నడిపిస్తున్నారు. రోజాకు తోడుగా గెస్ట్ జడ్జీలు వచ్చి పోతున్నారు.

జబర్దస్త్ నుంచి నాగబాబు వైదొలిగినప్పటికీ రోజా కొనసాగుతోంది. నాగబాబు తప్పుకున్నాక రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ జబర్దస్త్ ని నడిపిస్తున్నారు. రోజాకు తోడుగా గెస్ట్ జడ్జీలు వచ్చి పోతున్నారు. ఒక్కొక వారం.. ఒక్కో గెస్ట్ ని జబర్దస్త్ కు తీసుకువస్తున్నారు. మార్చి 13న ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి సంబంధించిన ప్రోమో విడుదుల చేశారు.

ఈ ప్రోమో గమనిస్తుంటే వచ్చే వారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ షో హైలైట్ కానుంది. ముఖ్యంగా సుడిగాలి సుదీర్ టీం బెత్తం దెబ్బలు అంటూ చేసిన స్కిట్, ఓ జబర్దస్త్ కమెడియన్ రోజాపై వేసిన సెటైర్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

రోజా పేరు చెప్పగానే నటిగా మాత్రమే కాదు.. ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ లేడీ పొలిటీషియన్ కూడా గుర్తుకు వస్తుంది. రోజా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక తన వాక్ చాతుర్యంతోనే ఫేమస్ అయ్యారు. వైసిపిలో చేరాక రోజా తొలిసారి ఎమ్మెల్యేగా 2014లో ఎన్నికయ్యారు. 2019లో కూడా వరుసగా రెండవసారి రోజా నగిరి నుంచి గెలుపొందారు.

రోజాకు ఉన్న క్రేజ్, వైసిపిలో ఆమె చురుగ్గా పనిచేసిన విధానం ఇవన్నీ గమనించిన రాజకీయ విశ్లేషకులు.. రోజాకు జగన్ క్యాబినెట్ లో చోటు ఖాయం.. ఆమె మంత్రి కావడం ఖాయం అనే ఊహాగానాలు వినిపించాయి.

కానీ రోజాకు మంత్రి పదవి దక్కలేదు. దీనిపై చాలా చర్చ జరిగింది. మంత్రి పదవి వస్తే రోజా జబర్దస్త్ నుంచి కూడా తప్పుకుంటుందని అంతా భావించారు. కానీ మంత్రి పదవి దక్కకపోవడంతో రోజా జబర్దస్త్ లో కొనసాగుతున్నారు. ప్రతివారం నవ్వులు పూయించే ఈ షోలో రోజా జడ్జిగా కొనసాగుతున్నారు.

ఇక ప్రోమో విషయానికి వస్తే ఓ జబర్దస్త్ కమెడియన్ స్కిట్ లో భాగంగా రోజాపై ఫన్నీ సెటైర్ వేశాడు. ప్రస్తుతం రోజాకు మంత్రి పదవి లేదన్న విషయాన్ని గుర్తు గుర్తు చేసే విధంగా డైలాగ్ చెప్పాడు.

సదరు కమెడియన్ ఎక్స్ట్రా జబర్దస్త్ కు అతిథిగా వచ్చిన యంగ్ హీరో విశ్వక్ సేన్ వద్దకు వెళ్లి.. నాకొక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ వర్కౌట్ కావాలంటే ఎవరో ఒకరి దగ్గర కొట్టించుకోవాలి. నన్ను కొట్టండి అని అడుగుతాడు. దీనికి విశ్వక్ సేన్ నా తాతయ్య వయసున్నవారిని నేను కొట్టను అని అంటాడు.

దీనితో అతడు రోజా వద్దకు వెళతాడు. మేడం మీరైనా ఒక దెబ్బ నన్ను కొట్టండి అని అడుక్కుంటాడు. అందుకు రోజా ఒప్పుకోదు. అతడి పక్కనే ఉన్న వ్యక్తి.. మేడం మీరు కనుక ఆయన్ని కొట్టారంటే మీకు మంత్రి పదవి గ్యారెంటీ అని అంటాడు. ఈ డైలాగ్ నవ్వులు పూయించే విధంగా ఉంది. ప్రోమో కావడంతో దీనికి రోజా ఎలా స్పందించిందనేదీ చూపించలేదు.

రోజా రెస్పాన్స్ చూడాలంటే మార్చి 13న ఈ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక జబర్దస్త్ లో బూతు డైలాగులు ఎక్కువవుతున్నాయనే విమర్శకుడా చాలా కాలంగా ఉంది.

loader