సోషల్ మీడియాలో సినీ హీరోల అభిమానుల మధ్య, రాజకీయ నాయకుల అభిమానుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక హీరో అభిమానులు మరొక హీరోకి వ్యతిరేకంగా ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సామజిక మాధ్యమాల్లో పోస్ట్ లు పెడుతుంటారు. కొన్నిసార్లు ఫేక్ న్యూస్ లు కూడా స్ప్రెడ్ చేస్తుంటారు. 

సోషల్ లో స్ప్రెడ్ అవుతున్న ఫేక్ న్యూస్ వల్ల సెలెబ్రిటీలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్న మరో హీరో అభిమానులపై మెగా హీరో అల్లు సిరీస్ మండిపడ్డాడు. 

ఓ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ పోస్ట్ వైరల్ అయింది. ఈ పోస్ట్ చిరంజీవి, అల్లు అర్జున్ ని కించపరిచే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అల్లు శిరీష్ ఘాటుగా స్పందించాడు. ఇలాంటి ఫేక్ ఫోస్టులు పెట్టి నెగిటివిటీని పెంచొద్దు. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్త అని అల్లు శిరీష్ హెచ్చరించాడు. 

ప్రభుత్వానికి చిరంజీవి డిమాండ్.. మహేష్ మనసు దోచుకున్న మెగాస్టార్!

దీనితో సదరు ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆ పోస్ట్ వెంటనే డిలీట్ అయిపోయింది. అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. నేడు ఆ చిత్ర ప్రీరిలీజ్ వేడుకని హైదరాబాద్ లో గ్రాండ్ గా జరపనున్నారు. ఈ సంక్రాంతికి దర్బార్,సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఎంత మంచి వాడవురా చిత్రాలు బాక్సాఫీస్ వార్ కు సిద్ధం అవుతున్నాయి. దీనితో ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల చిత్రాలపై ధీమాతో ఉన్నారు. 

సరిలేరు ప్రీరిలీజ్: పోకిరి చూశాక చిరంజీవి గారు రెండు గంటలపాటు.. : మహేష్