యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, సూర్య లాంటి స్టార్ హీరోల సరసన సమీరా రెడ్డి హీరోయిన్ గా నటించింది. అశోక్, నరసింహుడు, జై చిరంజీవి, సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రాల్లో సమీరా రెడ్డి తన అందాలు ఆరబోసింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, సూర్య లాంటి స్టార్ హీరోల సరసన సమీరా రెడ్డి హీరోయిన్ గా నటించింది. అశోక్, నరసింహుడు, జై చిరంజీవి, సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రాల్లో సమీరా రెడ్డి తన అందాలు ఆరబోసింది. అప్పట్లోనే సమీరా రెడ్డి వెండితెరపై గ్లామర్ ఒలకబోసింది. 

రాశి ఖన్నా, స్టార్ హీరోకి అలా జరగడం ఖాయం.. జ్యోతిష్యుడి వివాదాస్పద వ్యాఖ్యలు

సమీరా రెడ్డికి సరైన సక్సెస్ లేకపోయినప్పటికీ నటన, అందంతో మెప్పించింది. సమీరా రెడ్డి 2014లో సినిమాలకు స్వస్తి చెప్పి అక్షయ్ వర్ధే అనే ముంబై వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది. ప్రస్తుతం సమీరా భార్యగా, తల్లిగా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. సమీరా రెడ్డి గత ఏడాది రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 

View post on Instagram

సమీరా రెడ్డి గర్భవతిగా ఉన్న సమయంలో బికినిలో స్విమ్మింగ్ పూల్ అడుగున సాహసాలు చేస్తున్న ఫొటోల్ని అప్పట్లో షేర్ చేసింది. అవి కాస్త నెటిజన్లలో వైరల్ అయ్యాయి. 

View post on Instagram

తాజాగా తన ప్రెగ్నన్సీ రోజులు గుర్తుచేసుకుంటూ మరొకొన్ని ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది. నిండు గర్భంతో బికినిలో స్విమ్మింగ్ పూల్ అడుగున ఊపిరి బిగపట్టి ఫోటో షూట్ చేస్తున్న సమీరా రెడ్డి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గర్భంతో ఉన్న సమయంలో మహిళలు అలాంటి సాహసాలు చేయాలంటే భయపడతారు. 

View post on Instagram

9వ నెల గర్భంతో ఉన్నప్పటికీ ఈ సాహసాలు చేశాను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భయం లేకుండా ఉండాలి. గర్భంలో ఉన్న నా కుమార్తె నైరా వల్లే నాకు ఈ ఆలోచన వచ్చింది అని సమీరా రెడ్డి తెలిపింది. 

View post on Instagram
View post on Instagram