జులాయి - సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల అనంతరం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్  చిత్రం 'అల.. వైకుంఠపురములో'  మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై ఆడియెన్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో స్టార్ యాక్టర్స్ ఉండడంతో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుందని ఇప్పటికే ఓ పాజిటివ్ టాక్ వచ్చింది.  అయితే త్రివిక్రమ్ స్నేహితుడైన సునీల్ పాత్ర కూడా సినిమాలో మరొక హైలెట్ పాయింట్ అని తెలుస్తోంది.

బంక్ శీను - బంతి - బాబీ - నీలాంబరి అంటూ.. తన గత సినిమాల్లో సునీల్ క్యారెక్టర్ ని అందరికి గుర్తుండి పోయేలా చేసిన త్రివిక్రమ్ ఈ సారి సీతారామ్ అనే పాత్ర ద్వారా సునీల్ ని సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడట. అంటే అంతకుమించి అన్నమాట. సీతారామ్ పంచ్ లు కూడా సినిమాలో హైలెట్ గా నిలవనున్నట్లు టాక్. అమృతం హర్ష - సునీల్ కాంబినేషన్ లోని ఎపిసోడ్స్ ఆడియెన్స్ పిచ్చ పిచ్చగా ఎంటర్టైన్ చేస్తాయని తెలుస్తోంది.

ఇక సీనియర్ యాక్టర్ మురళి శర్మ పాత్ర కూడా సినిమాలో చాలా కీలకమని తెలుస్తోంది. కథానాయకుడి తండ్రి పాత్రలో నటించిన ఈ యాక్టర్ గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో డిఫరెంట్ యాక్టింగ్ స్కిల్స్ ని బయటపెట్టారట. ఈ విషయాన్నీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ వివరించాడు. 'అల..వైకుంఠపురములో' సినిమాకు మురళి శర్మ గారి పాత్ర ఒక బ్యాక్ బోన్ లాంటిదని అన్నారు. బన్నీ ఇంత గట్టిగా చెప్పారంటే ఆయన పాత్ర రేంజ్ లో అలరించనుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక సుశాంత్ పాత్ర కూడా కథలో చాలా అల్లు అర్జున్ తెలిపాడు. ఎక్కడా అభిమానులను నీరాశపరచకుండా సినిమా ఆడియెన్స్ కి మంచి కిక్ ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మరీ సినిమా ఎంత వరకు క్లిక్ అవుతుందో చూడాలి. పూజా హెగ్డే - నివేత పేతురేజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. గీత ఆర్ట్స్ - హారిక హాసిని బ్యానర్స్ లో చినబాబు - అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్వహించారు.

Also Read: మహేష్, బన్నీ బాక్స్ ఆఫీస్ ఫైట్.. 10 కామన్ పాయింట్స్ గమనించారా?