స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్, ఈ చిత్రంలోని పాటలు సినిమాపై అంచనాలని తారాస్థాయికి చేర్చాయి. 

తమన్ సంగీతం అందించిన పాటలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే . సామజవరగమన, రాములో రాములా, ఇటీవల విడుదలైన బుట్టబొమ్మా సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. డీజే చిత్రంలో బన్నీ, పూజా హెగ్డే మాస్ స్టెప్పులతో ప్రేక్షకులని అలరించారు. ఈ చిత్రంలో డాన్సులు అంతకు మించి ఇండబోతున్నట్లు సమాచారం. 

తాజాగా పూజా హెగ్డే బుట్టబొమ్మ సాంగ్ చిత్రీకరణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మేకింగ్ వీడియోలో పూజా, అల్లు అర్జున్ వేస్తున్న డాన్స్ ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే ఈ వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ అవుతోంది. 

గ్యాంగ్ లీడర్ తో రాములమ్మ.. ఎన్నో ఏళ్ల తర్వాత.. ఫాన్స్ కు పండగే!

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న అల వైకుంఠపురములో చిత్రంప్రేక్షకుల ముందుకు రానుంది. 

తమన్నా కెరీర్ లో బెస్ట్ మూవీస్.. పెర్ఫామెన్స్ చింపేసింది!

ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని జనవరి 6న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.