స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తున్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్ తో వచ్చిన మహేష్ బాబు రికార్డుల మోత మోగిస్తున్నాడు. తొలి మూడు రోజుల్లోనే ఈ రెండు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టాయి. 

ఈ రెండు చిత్రాల దూకుడు చూస్తుంటే త్వరలోనే 100 కోట్ల షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని మాయ చేస్తోంది. రోజు రోజుకు ఈ చిత్రానికి వసూళ్లు పెరుగుతున్నాయి. 

జగన్ బంపర్ ఆఫర్.. ఊహించని రిప్లై ఇచ్చిన పోసాని!

ఈ తరుణంలో అభిమానుల మధ్య బాక్సాఫీస్ లెక్కల గురించి చర్చ జరగడం సహజం. బాహుబలి రెండు భాగాల తర్వాత టాలీవుడ్ లో అంతటి పెద్ద విజయంగా నిలిచిన చిత్రం రంగస్థలం. రాంచరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం టాలీవుడ్ లో బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత 3వ అతిపెద్ద విజయంగా రికార్డు సృష్టించింది. 

హీరో కూతురి సంచలనం.. రూ.30 కోట్ల సంపాదన.. రెండు సినిమాలకే ఎలా!

ఇప్పుడు రంగస్థలం రికార్డుని బ్రేక్ చేసే చిత్రం ఏదనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికైతే ఈ రెండు చిత్రాలు అద్భుతమైన జోరు ప్రదర్శించాయి. ఇక సంక్రాంతి సెలవులు ముగుస్తుండడంతో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో కలెక్షన్స్ లో కూడా డ్రాప్ ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో రంగస్థలం రికార్డ్ బ్రేక్ అవుతుందా.. ఆ ఐతే ఆ ఘనతని మహేష్, అల్లు అర్జున్ లలో ఎవరు సాధిస్తారనే విషయం తేలాలంటే ఈ వీకెండ్ ముగిసే వరకు ఆగాల్సిందే. అప్పటికి ఈ రెండు చిత్రాలు ఫుల్ రన్ లో సాధించే వసూళ్లపై ఓ క్లారిటీ వస్తుంది. రంగస్థలం చిత్రం ఫుల్ రన్ లో 123 కోట్ల షేర్ సాధించింది.