స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండిస్తోంది. త్రివిక్రమ్ దర్శత్వంలో సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం 140 కోట్లకు పైగా షేర్ సాధించి నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేస్తోంది. 

ఈ రికార్డులు సాధించడంపై ఒక విషయం తప్పనిసరిగా చర్చించుకోవాలి. సంక్రాంతికి విడుదలైన రెండు చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకుని టికెట్ ధరని 200కి పెంచారు. పెరిగిన టికెట్ రేట్స్ కూడా ఈ అత్యధిక వసూళ్లకు ఉపయోగపడ్డాయి. 

ఇటీవల అల వైకుంఠపురములో చిత్ర యూనిట్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో టికెట్ ధరలపై అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

టికెట్ ధర 200కి పెంచినప్పటికీ కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. అంటే ప్రేక్షకులు ఎంత వెచ్చించి అయినా సినిమా చూసేందుకు రెడీగా ఉన్నారా అని ప్రశ్నించగా.. అల్లు అరవింద్ అవునని సమాధానం ఇచ్చారు. 

భూమికకు ఇంకేం పాత్రలు దొరకడం లేదా.. గోపీచంద్ సినిమాలో..

ముంబై లాంటి నగరాల్లో వీకెండ్ లో 400 నుంచి 700 వరకు టికెట్ ధర ఉంటుంది. ఈ పద్దతిని అన్ని మెట్రో నగరాల్లో ఫాలో అవుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో మాత్రమే టికెట్ ధరలని ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయి. నిర్మాతలు టికెట్ ధరలు నిర్ణయించేలా ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. 

టాలీవుడ్ ఫ్లాప్ డైరెక్టర్స్ చేతుల్లో వందల కోట్లు.. వివరాలు ఇవే!

ఎక్కువ మొత్తం వెచ్చించి సినిమా చూడలేని ప్రేక్షకుల కొరకు ముందు వరుసలో కొన్ని రిజర్వ్డ్ సీట్లు కేటాయించాలనే ఆలోచన కూడా ఉంది అని అల్లు అరవింద్ అన్నారు. అల్లు అరవింద్ మాటలని బట్టి టికెట్ ధరలు పెంచుకునేందుకు టాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టేసినట్లు ఉన్నారు. సంక్రాంతి సీజన్ కాబట్టి టికెట్ ధర పెంచినప్పటికీ ప్రేక్షకులు సినిమా చూడడానికి ఆసక్తి చూపారు. మిగిలిన సమయాల్లో అంత ధర పెట్టి సినిమాలు చూడలేని ప్రేక్షకుల సంగతేంటి అనే చర్చ కూడా మొదలయింది.