భూమిక ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. అగ్ర హీరోల సరసన నటించిన భూమిక అనేక ఘనవిజయాలు సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం భూమిక టాలీవుడ్ లో క్యారెక్టర్స్ రోల్స్ చేస్తోంది. కానీ మిగిలిన సీనియర్ హీరోయిన్ల తరహాలో ఆమెకు పవర్ ఫుల్ రోల్స్ దక్కడం లేదు. 

వదిన, సోదరి తరహా పాత్రలతో సరిపెట్టుకుంటోంది. గతంలో హీరోయిన్ గా తెచుకున్నంత గుర్తింపు భూమిక క్యారెక్టర్ రోల్స్ కి దగ్గడం లేదు. ఆమె ఎంచుకుంటున్న పాత్రల్లో బలం లేకపోవడమే అందుకు కారణం ఏమో. సవ్యసాచి చిత్రంలో నాగ చైతన్య సోదరిగా నటించింది. నాని ఎంసీఏ చిత్రంలో వదినగా నటించింది. 

ప్రస్తుతం మరోసారి సోదరి పాత్రలో నటించేందుకు భూమిక రెడీ అవుతోంది. తాజా సమాచారం మేరకు సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సీటీమార్ చిత్రంలో భూమిక ఓ పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. గోపీచంద్ సోదరిగా భూమిక ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అక్కా చెల్లిళ్ల హాట్ ఫోజులు చూశారా.. మతిపోగొడుతున్న చిరుత హీరోయిన్

తన తోటి సీనియర్ హీరోయిన్లంతా క్యారెక్టర్ రోల్స్ అయినప్పటికీ పవర్ ఫుల్ గా ఉండేలా చూసుకుంటున్నారు. కానీ భూమిక మాత్రం ఒకే తరహా పాత్రల వద్దే ఆగిపోయిందనే వాదన వినిపిస్తోంది. 

'మెగా' మాయలో త్రివిక్రమ్.. కొన్నేళ్ల పాటు వారికే అంకితం!

ఒకప్పుడు భూమిక టాలీవుడ్ అగ్ర హీరోలకు లక్కీ హీరోయిన్. పవన్ కళ్యాణ్ తో ఖుషి, మహేష్ తో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకుంది.