టాలీవుడ్ ఫ్లాప్ డైరెక్టర్స్ చేతుల్లో వందల కోట్లు.. వివరాలు ఇవే!

First Published 29, Jan 2020, 8:56 AM IST

సాధారణంగా హిట్ పడితే ఆ దర్శకుడు తదుపరి చిత్రం భారీ బడ్జెట్ లో ఉంటుంది. కానీ  టాలీవుడ్ లో ఈ ఏడాది ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు దర్శకులు ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ 100ల కోట్ల బడ్జెట్, బిజినెస్ చేసే చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. 

రాధాకృష్ణ: ఈ దర్శకుడు ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో జాన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జిల్ మూవీతో రాధాకృష్ణ దర్శకుడిగా మారాడు. ఆ చిత్రానికి స్టైలిష్ మూవీ అని పేరున్నప్పటికీ కమర్షియల్ గా రాణించలేదు. అయినా కూడా ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్, బిజినెస్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

క్రిష్ జాగర్లమూడి : ప్రతిభగల దర్శకుడిగా పేరున్నప్పటికీ క్రిష్ కు కమర్షియల్ హిట్స్ తక్కువ. క్రిష్ చివరగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నిరాశనే మిగిల్చింది. అయినా కూడా క్రిష్ మీద ఉన్న నమ్మకంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. అలాంటి ఇలాంటి ఛాన్స్ కాదు.. ఏకంగా 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కే పీరియాడిక్ ఫిలిం అని వార్తలు వస్తున్నాయి.

బొమ్మరిల్లు భాస్కర్ : బొమ్మరిల్లు, పరుగు చిత్రాలతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు భాస్కర్. ఈ రెండు చిత్రాల తర్వాత భాస్కర్ కు హిట్ లేదు. అయినా కూడా అక్కినేని వారసుడు అఖిల్ ఆశలన్నీ ఈ దర్శకుడిపైనే పెట్టుకున్నాడు. అఖిల్ నాల్గవ చిత్రానికి దర్శకుడు భాస్కర్. మంచి బడ్జెట్ లోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది.

గోపీచంద్ మలినేని : దుబాయ్ శ్రీను, బలుపు చిత్రాలతో గోపించంద్ మలినేని కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. గోపీచంద్ చివరగా తెరకెక్కించిన విన్నర్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం రవితేజతో ఈ దర్శకుడు క్రాక్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పోలీస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ లోనే తెరకెక్కుతోంది.

సంపత్ నంది : రచ్చ ఫేమ్ సంపత్ నంది చివరగా తెరకెక్కించిన చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి. ప్రస్తుతం సంపత్ హీరో గోపీచంద్ తో సీటీమార్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

శ్రీకాంత్ అడ్డాల : కొత్తబంగారు లోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలతో శ్రీకాంత్ అడ్డాల క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. కానీ బ్రహ్మోత్సవం చిత్రంతో ఈ దర్శకుడి ఇమేజ్ మొత్తం పాడైంది. ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేకుండా ఉన్న తరుణంలో శ్రీకాంత్ అద్దాలకు షాకిచ్చే ఆఫర్ దక్కింది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ హీరోగా నారప్ప అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది తమిళంలో ఘనవిజయం సాధించిన ఊర మాస్ మూవీ అసురన్ కి రీమేక్.

గుణశేఖర్ : ఇటీవల గుణశేఖర్ కి కూడా సరైన సక్సెస్ లేదు. రుద్రమ దేవి చిత్రం మాత్రం ప్రశంసలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం గుణశేఖర్ రానా దగ్గుబాటి హీరోగా హిరణ్యకశ్యప చిత్ర పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనుంది.

రమేష్ వర్మ : వీర లాంటి డిజాస్టర్ ఇచ్చిన రమేష్ వర్మకు రవితేజ మరో ఛాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రానుంది.

బోయపాటి శ్రీను : బోయపాటి తిరుగులేని మాస్ డైరెక్టర్. కానీ ఈ దర్శకుడు చివరగా చివరగా తెరకెక్కించిన వినయ విధేయ రామ చిత్రం పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే. అలాంటి తరుణంలో దాదాపు 70 కోట్ల బడ్జెట్ లో బోయపాటి బాలయ్యతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

వెంకీ అట్లూరి : తొలిప్రేమ చిత్రంతో మెప్పించిన వెంకీ అట్లూరి సెకండ్ ఫిలిం గండాన్ని దాటలేక పోయాడు. అఖిల్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ మజ్ను చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం వెంకీ అట్లూరి నితిన్ తో రంగ్ దే అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

loader