స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రంలో ఈ సంక్రాంతికి విడుదలైన ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే.  త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం మాత్రమే కాదు.. నాన్ బాహుబలి రికార్డులు సైతం సృష్టించింది. 

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 160 కోట్ల వరకు షేర్ కొల్లగొట్టింది. పురిటి బిడ్డలు మార్పిడి జరిగిన కథాంశంతో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ స్క్రీన్ ప్రజెన్స్ మ్యాజిక్ చేశాయి. తమన్ సంగీత ఈ చిత్రాన్ని పెద్ద ప్లస్ అయింది. ఇక హీరోయిన్ పూజా హెగ్డే అందాలు కూడా ఆకట్టుకున్నాయి. 

షాకిస్తోన్న యాంకర్ సుమ కొడుకు, ఇలా ఉన్నాడేంటి.. ఆ కుక్క మరో హైలైట్

తాజాగా ఈ చిత్రంలో డిలీట్ చేసిన ఓ సీన్ ని విడుదల చేశారు. ఫన్నీగా ఉన్న ఈ సన్నివేశం ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. సుశాంత్ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న సమయంలో బన్నీ అతడితో మాట్లాడుతుంటాడు. ఇంతలో బన్నీ సుశాంత్ కు ఓ వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో మేడపై ఒకేసారి రెండు సిగరెట్లు కాల్చుతూ, మద్యం సేవిస్తూ సుశాంత్ కనిపిస్తాడు. 

లేగ దూడతో సెక్స్, కామంతో కళ్ళు మూసుకుపోయాయి.. యాంకర్ రష్మీ ట్వీట్ వైరల్!

ఆ వీడియో ద్వారా బన్నీ సుశాంత్ ని బ్లాక్ మెయిల్ చేయడం ఫన్నీగా ఉంది. ఆ రెండు సిగరెట్లు తాగడం చూసిన తర్వాత నీ సినిమాకు అర్జున్ రెడ్డి పార్ట్ 2 అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు బన్నీ సుశాంత్ తో అంటాడు. డిలీట్ సన్నివేశంపై మీరూ ఓ లుక్కేయండి..