సుమ కనకాల.. ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ యాంకర్స్ అనే ప్రస్తావన వస్తే మొదట గుర్తుకు వచ్చేది సుమనే. గత కొన్నేళ్లుగా సుమ టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. ఏ సినిమా ఈవెంట్ చూసినా దాదాపుగా సుమనే యాంకర్ గా కనిపిస్తుంది. చాలా మంది హీరోలు, నిర్మాతలకు సుమ యాంకర్ సెంటిమెంట్ గా మారిపోయిందంటే ఆమె ప్రతిభ అర్థం చేసుకోవచ్చు. 

యాంకర్ గా హుందాగా ఉంటూనే, అవసరమైన సమయాల్లో తన హాస్య చతురని ఉపయోగిస్తూ నవ్వులు పూయించేలా జోకులు వేయిస్తుంది. ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఈవెంట్ ని నడిపిస్తుంది. అందుకే సుమ అంత ఫేమస్. బుల్లితెరపై మహిళలలు మెచ్చే ప్రోగ్రాంలు కూడా సుమ చేస్తోంది. 

యాంకర్ గా సుమ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తుంది. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, సుమ 1999లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు రోషన్ కాగా, కుమార్తె మనస్విని. 

తాజాగా సుమ తన కొడుకు గురించి చెబుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తనకంటే బాగా ఎత్తుగా పెరిగిన రోషన్ ని చూసి సుమ మురిసిపోతోంది. నా డియరెస్ట్ రోషన్ పెద్దయ్యాడు, ధృడంగా మారాడు అని సుమ కామెంట్ పెట్టింది. తన కొడుకుతో ఉన్న పిక్ ని షేర్ చేసింది. రోషన్ హైట్ చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.  ఈ పిక్ లో మరో హైలైట్ కూడా ఉంది.. అదే సుమ పెంపుడు కుక్క. 

రోషన్ ఆ కుక్కపై చేయి వేయగా అది ప్రేమగా రోషన్ వైపు చూస్తున్నట్లు ఉన్న ఫోజు ఆకట్టుకుంటోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

And my dearest roshan grew bigger and stronger . Love u ra 😍

A post shared by Suma Kanakala (@kanakalasuma) on Mar 15, 2020 at 1:02am PDT