ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద కొదమసింహాల తరహాలో పోటీ పడేందుకు మహేష్ బాబు, అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం శనివారం విడుదల కాగా.. అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో చిత్రం ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు నుంచే మహేష్ బాబు కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వేట ప్రారంభించాడు. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు చిత్రం రికార్డ్ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. 

ఇదిలా ఉండగా నేడు విడుదలైన అల వైకుంఠపురములో చిత్రం కూడా రికార్డుల వేట ప్రారంభించింది. తొలి రోజు ఈ చిత్రానికి యుఎస్ లో సాలిడ్ నంబర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. 

మొన్ననే విడాకులు.. బికినీలో రచ్చ చేస్తున్న హీరోయిన్!

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బాక్సాఫీస్ వద్ద అప్పుడే అల్లు అర్జున్ చిత్రం రికార్డులు ప్రారంభించింది. సరిలేరు నీకెవ్వరు పేరిట నమోదైన ప్రీమియర్ షో కలెక్షన్ల రికార్డుని అల వైకుంఠపురములో చిత్రం అధికమించింది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లలో ప్రీమియర్ షోలకు గాను సరిలేరు నీకెవ్వరు చిత్రం 260K డాలర్లని వసూలు చేసింది. తాజాగా ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ అల వైకుంఠపురములో చిత్రం 295K డాలర్లని ఆస్ట్రేలియా బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. 

కోట్లు వదిలేసి పిచ్చోడిలా పవన్.. చిరంజీవిపై విరుచుకుపడ్డ అశ్వినీ దత్!

సాహో(265K డాలర్లు) రికార్డుని కూడా బద్దలు కొట్టిన అల వైకుంఠపురములో చిత్రం బాహుబలి 2 తర్వాత రెండవ స్థానంలో ఆస్ట్రేలియా ప్రీమియర్స్ రికార్డు సొంతం చేసుకుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించింది. సుశాంత్, నివేత, మురళి శర్మ, టబు కీలక పాత్రల్లో నటించారు. తమన్ ఈ చిత్రానికి అందించిన సంగీతం ఇటీవల విడుదలైన తెలుగు చిత్రాల్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. 

ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటోస్.. కుర్రాళ్ళని ఉడికించే ఫోజులు