టాలీవుడ్ లోకి మెరుపులా వచ్చి మాయమైంది శ్వేతా బసు. కొత్తబంగారు లోకం చిత్రంలో శ్వేతా బసు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఆ చిత్రం విజయం తర్వాత శ్వేతా బసుకి మరిన్ని అవకాశాలు వచ్చాయి. కానీ మరోసారి ఆమెకు కొత్తబంగారు లోకం లాంటి హిట్ పడలేదు. 

దీనితో క్రమంగా తెలుగు చిత్రాలకు దూరమైంది. హిందీలో అవకాశాల కోసం ప్రయత్నించినా ఫలించలేదు. అక్కడ కూడా శ్వేతా బసుకి అదృష్టం కలసి రాలేదు. హిందీలో నటించిన చిన్న చిత్రాలు నిరాశపరిచాయి. ఈ క్రమంలో రోహిత్ మిట్టల్ అనే వర్థమాన దర్శకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 

వీరిద్దరూ 2018 డిసెంబర్ లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. కానీ ఏడాది తిరగక ముందే వీరిద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకుని ప్రస్తుతం విడి విడిగా జీవిస్తున్నారు. 

కోట్లు వదిలేసి పిచ్చోడిలా పవన్.. చిరంజీవిపై విరుచుకుపడ్డ అశ్వినీ దత్!

ఈ విషయాన్ని శ్వేతా బసు గత ఏడాది డిసెంబర్ లో స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కొన్ని నెలల పాటు జరిగిన చర్చల తర్వాత తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు శ్వేతా బసు తెలిపింది. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతా బసు తెలిపింది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Mandatory #goa beach photos check ✅

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on Jan 11, 2020 at 12:43am PST

ఇదిలా ఉండగా శ్వేతా బసు మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారింది. గోవా బీచ్ లో బికినిలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని శ్వేతా బసు షేర్ చేసింది. శ్వేతా బసు బికినీ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on Jan 11, 2020 at 2:22am PST