అమరావతి రాజధాని వివాదం నెమ్మదిగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా కుంపటి రగిలిస్తోంది. ఇప్పటికే అమరావతి నుంచి రాజధానిని తరలించడంపై సినీ ప్రముఖులంతా స్పందించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ ప్రోడ్యూసర్  అశ్విని దత్ అమరావతి రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 

సీఎం జగన్ నేతృత్వంలోనిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 రాజధానులు ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చిన సంగతి తెలిసిందే. వైజాగ్ ని కార్యనిర్వహణ రాజధానిగా, అమరావతిని శాసన నిర్వహణ రాజధానిగా, కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ గా చేయాలనే ప్రతిపాదన తీసుకు వచ్చారు. దీనితో అమరావతి ప్రాంతంలో రాజధానికి భూమిలిచిన రైతులు గత కొన్ని వారాలుగా రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఇటీవల నిర్మాత అశ్విని దత్ అమరావతి ప్రాంతంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరంజీవిపై విమర్శల వర్షం కురిపించారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని చిరంజీవి సమర్థించిన సంగతి తెలిసిందే. 

'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్సాఫీస్ దద్దరిల్లింది!

అశ్విని దత్ మాట్లాడుతూ.. చిరంజీవి చేసిన వ్యాఖ్యలని అయన విజ్ఞతకే వదిలేస్తున్నా. అసలు చిరంజీవికి ఏం తెలుసు.. ఆయనకు అనుభవం ఉందా.. బహుళ రాజధానుల వ్యవస్థ ప్రపంచం మొత్తం విఫలమైంది. ఆయన తమ్ముడు సినిమాలు వదిలేసి ప్రజల్లో  తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ అమరావతిలో రైతుల కోసం పోరాడుతున్న సంగతి చిరంజీవికి తెలియదా.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే కోట్లల్లో పారితోషికం వస్తుంది అని అశ్విని దత్ అన్నారు. 

అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' రివ్యూ

అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యే అవకాలు ఉన్నాయి. చిరంజీవి, అశ్విని దత్ కాంబినేషన్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి.