సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం దర్బార్. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. 

ఈ చిత్ర ట్రైలర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ తరుణంలో దర్బార్ చిత్ర యూనిట్ కి ఊహించని షాక్ ఎదురైంది. మలేషియాకు చెందిన డియంవై క్రియేషన్స్ అనే మలేషియాకు చెందిన ఎంటటైన్మెంట్ సంస్థ మద్రాసు హై కోర్టులో లైకా ప్రొడక్షన్స్ పై పిటిషన్ దాఖలు చేశారు. 

లైకా సంస్థ తమకు రూ23 కోట్ల  బకాయిలు చెల్లించాల్సి ఉందని, కానీ ఇంతవరకు ఆ ఊసే లేకుండా సినిమాలు విడుదల చేసుకుంటున్నారని ఆ సంస్థ మద్రాసు హై కోర్టులో పిటిషన్ వేసింది. 

లైకా సంస్థ తమ వద్ద రజనీకాంత్ 2.0 చిత్రం కోసం 12 కోట్ల లోన్ తీసుకున్నారు. ఆ అనౌట్ ఇప్పటికి 23 కోట్లకు చేరుకుంది. కానీ తమకు రావాల్సిన డబ్బు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడుతున్నారు అని డియంవై సంస్థ పిటిషన్ లో ఆరోపించింది. కనుక తమ బాకీ చెల్లిచే వరకు దర్బార్ చిత్ర రిలీజ్ బ్యాన్ చేయాలని పిటిషన్ లో కోర్టుని కోరింది. 

'10th క్లాస్' హీరోయిన్ రహస్య వివాహం?

దీనితో మద్రాసు  హైకోర్టు దర్బార్ నిర్మాతలకు నోటీసులు పంపారు. ఈ పిటిషన్ పై జనవరి 2లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తరుణంలో దర్బార్ విడుదలపై రజనీకాంత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రజనీకాంత్ పోలీస్ అధికారిగా నటించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. 

కీరవాణి ఫ్యామిలీ ఆర్థిక కష్టాలు.. సక్సెస్ మీట్ అంటే సినిమా ఫ్లాప్!