హీరోయిన్ సునైనా తెలుగు ప్రేక్షకులకు పరిచయం తక్కువ. సునైనా తెలుగు చిత్రం కుమారి వెర్సస్ కుమారి చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత టీనేజ్ లవ్ స్టోరీ 10th క్లాస్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రంలో సునైనా పోషించిన పాత్ర చాలా కీలకం. 

గ్లామర్ లోను, నటనతోనూ సునైనా ఆ చిత్రంలో ఆకట్టుకుంది. ఇటీవల సునైనా తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. సునైనా ఇటీవల ధనుష్ చిత్రం ఎన్నై నొక్కి పాయమ్ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తన గ్లామర్ ఫోటోలని అభిమానులతో షేర్ చేసుకుంటోంది. 

ఈ సోషల్ మీడియా వల్లే సునైనాకు తాజాగా చిక్కులు వచ్చాయి. ఇటీవల సునైనా సోషల్ మీడియాలో ఓ యువకుడితో ఫోటో దిగి పోస్ట్ చేసింది. సాధారణంగా హీరోయిన్లు కొత్త వ్యక్తులతో కాస్త క్లోజ్ గా కనిపిస్తే చాలు.. సోషల్ మీడియాలో పుకార్లు జోరందుకుంటాయి. సునైనా విషయంలో కూడా అదే జరిగింది. 

సునైనా రహస్య వివాహం చేసుకుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనితో సునైనా సన్నిహితులు, స్నేహితులు ఆమెకు ఫోన్లు చేయడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం కూడా ప్రారంభించారు. 

కీరవాణి ఫ్యామిలీ ఆర్థిక కష్టాలు.. సక్సెస్ మీట్ అంటే సినిమా ఫ్లాప్!

దీనితో సునైనా ఈ వార్తలని ఖండించింది. తనకు వివాహం జరిగినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేసింది.. నాకు రహస్య వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు. నా పెళ్లి ఖరారైతే నేను ప్రకటిస్తా. కుటుంబసభ్యుల సమక్షంలోనే నా వివాహం జరుగుతోంది. ఇప్పటికైతే నేనెవరిని పెళ్లి చేసుకోలేదు అని సునైనా తేల్చి చెప్పింది. 

భారత రాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి!