Asianet News TeluguAsianet News Telugu

‘ఆర్ఆర్ఆర్‌’: ఇది 'పులిహార' వార్తే...రాజమౌళి దిగజారడు

ఒకప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక..ఫలానా సీన్...ఫలానా సినిమా నుంచి ఎత్తారంటూ రివ్యూలు వచ్చేవి. ట్రోలింగ్ జరిగేది. దాన్ని డైరక్టర్స్, హీరోలు లైట్ తీసుకునేవారు. కానీ కాలం మారింది.

'300' Movie Inspired NTR's Fight In #RRR
Author
Hyderabad, First Published Feb 2, 2020, 6:24 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఒకప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక..ఫలానా సీన్...ఫలానా సినిమా నుంచి ఎత్తారంటూ రివ్యూలు వచ్చేవి. ట్రోలింగ్ జరిగేది. దాన్ని డైరక్టర్స్, హీరోలు లైట్ తీసుకునేవారు. కానీ కాలం మారింది. ఇవి సోషల్ మీడియా రోజులు. సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఆ సినిమాలో సీన్ ..ఫలానా సినిమా నుంచి ఎత్తారు. ఫలానా పాట..ఆ ఆల్బమ్ నుంచి లేపారు అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద హీరోల పెద్ద సినిమాలకు ఈ పోటు ఎక్కువైపోయింది. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిపి నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఓ సన్నివేశం ఇప్పుడు ఇండస్ట్రీలో, మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా రాజమౌళి గత చిత్రాలు ..హాలీవుడ్ ప్రేరణతో రావటం ఈ తరహా వార్తలకు ఆజ్యం పోస్తోంది.

ఎన్టీఆర్ ని యంగ్ టైగర్ అనే పేరు ఉంది. అందుకు తగినట్లుగానే రాజమౌళి గత చిత్రం యమదొంగలో ..రాజమౌళి చేత పులిలా డైలాగులు చెప్పించారు. ఇప్పుడు ఏకంగా పులితో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను ఆర్ ఆర్ ఆర్ లో రాజమౌళి పెట్టినట్లు ఈ మధ్య లీకైన ఫొటోను బట్టి అందరికీ అర్దమైంది.   కొమరం భీమ్ పాత్రధారి అయిన తారక్ ఓ భీకరమైన అడవిలో పెద్ద పులితో పోరాడే సన్నివేశం తెరకెక్కించారని అందరికీ తెలిసింది. దాంతో ఈ పులి ఫైట్ ని  '300 ' సినిమాలో తోడేలు ఫైట్ నుండి ఇన్స్పైర్ అయినట్టు టాక్ మొదలైపోయింది. ఈ మేరకు మీడియా ఓ పులిహార కథనం వండి వడ్డించేసింది.

చీరలో సెక్సీ ఫోజులు.. కుర్రాళ్ల గుండెల్ని కోస్తున్న నిధి!

అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్న సంగతి రాజమౌళికి తెలియంది కాదు. అలాంటప్పుడు అంతలా అందరికీ తెలిసిన సినిమానుంచి కాపీ కొట్టే తెలివి తక్కువ పని రాజమౌళి ఎందుకు చేస్తాడనేది ప్రశ్న. బాహుబలి సిరీస్ లతో యావత్ సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రాజమౌళి  'RRR' చిత్రం పై కూడా జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయని గుర్తు పెట్టుకోడా. ఖచ్చితంగా  ఆ స్థాయిని అందుకోవడానికి 'RRR' విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారనేది నిజం. కాబట్టి ఖచ్చితంగా ఇది పులిహార వార్తే.

ప్రేయసితో హీరో నిఖిల్ నిశ్చితార్థం పూర్తి.. ఫోటోలు ఇవిగో!

అదే సమయంలో  'RRR' కి లీకేజ్ ఇబ్బందులునుంచి తొలిగించటానికి టైట్ సెక్యూరిటీని పెట్టారని సమాచారం. ఎన్టీఆర్ కు సంభందించి లీకైన వీడియోను ఆన్ లైన్ నుండి తొలగించారు. ఏదేమైనా ఖచ్చితంగా హాలీవుడ్ కి దీటుగా సినిమాలు తెరకెక్కించగల సమర్దుడు జక్కన్న. అలాంటిది 'RRR' కోసం దిగజారి హాలీవుడ్ సినిమాని కాపీ కొడతారనేది అర్దం లేని వార్త.  పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో తారక్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు.

ఆమెని పెళ్లి చేసుకోను.. ప్రెస్ మీట్ పెట్టి హీరోయిన్ ని ఏకిపారేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

Follow Us:
Download App:
  • android
  • ios