టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత ఏడాది పలు సందర్భాల్లో నిఖిల్ తాను 2020లో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా చెప్పినట్లుగానే నిఖిల్ పెళ్ళికి సిద్ధం అవుతున్నాడు. తాజాగా నిఖిల్ నిశ్చితార్థం పూర్తయింది. 

గత ఐదేళ్లుగా నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉంటున్నాడు. ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారు. నిఖిల్, పల్లవి వర్మల నిశ్చితార్థం ప్రైవేట్ వేడుకగా కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ముఖాలు చూపించకుండా ఎంగేజ్ మెంట్ రింగ్స్ తో ఉన్న ఫోటో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

 

వీరిద్దరి వివాహం ఏప్రిల్ 16న గ్రాండ్ గా జరగబోతోంది. గత ఏడాది నిఖిల్ అర్జున్ సురవరం చిత్రంలో నటించాడు. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఈ ఏడాది నిఖిల్ కార్తికేయ సీక్వెల్ లో నటించబోతున్నాడు. 

మంచు లక్ష్మీ నిర్వహించిన ఓ టాక్ షోలో తొలిసారి నిఖిల్ తన ప్రేమ గురించి బయట పెట్టాడు. తాను ఒక డాక్టర్. ఆమె నా జీవితంలో చాలా స్పెషల్. నన్ను అర్థం చేసుకునే, నేను ఎప్పుడూ సరదాగా ఉండాలని కోరుకునే అమ్మాయి అని నిఖిల్ ఆ సమయంలో తన ప్రియురాలి గురించి తెలిపాడు.