Asianet News TeluguAsianet News Telugu

ప్రియురాలితో భర్త రొమాన్స్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

గోపాల్‌ అనే వ్యక్తికి  ఏడు సంవత్సరాల క్రితం ఎస్తర్‌ ఏంజల్‌తో వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టాక గోపాల్‌ భార్యను దూరంగా ఉంచటం ప్రారంభించాడు. మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య, పిల్లలను పూర్తిగా మరిచిపోయాడు.
 

wife caught husband with lover in hyderabad
Author
Hyderabad, First Published Sep 14, 2019, 12:56 PM IST

కట్టుకున్న భార్యను కాదని.. మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఏడుస్తూ కూర్చోలేదు. తన భర్తని.. అతని ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం ఇద్దరినీ చెప్పు, చీపురుతో చితక బాదింది. ఈ సంఘటన అల్వాల్ లోని సుభాష్ నగర్ లో  శనివారం ఉదయం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గోపాల్‌ అనే వ్యక్తికి  ఏడు సంవత్సరాల క్రితం ఎస్తర్‌ ఏంజల్‌తో వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టాక గోపాల్‌ భార్యను దూరంగా ఉంచటం ప్రారంభించాడు. మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య, పిల్లలను పూర్తిగా మరిచిపోయాడు.

ఈ నేపథ్యంలో భర్త ప్రియురాలితో ఓ ఇంట్లో ఉన్నాడని ఏస్తర్‌ తెలుసుకుంది. వెంటనే కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వెళ్లింది. ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది. ఎస్తర్‌తో పాటు ఆమె కుటుంబసభ్యులు కూడా గోపాల్‌, అతడి ప్రియురాలిపై దాడి చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios