విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్  లోని పలు జిల్లాలకు సాదారణం నుంచి భారీ వర్షం ముప్పు పొంచివుందని విశాఖలోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురిసే అవకాశం వుందని... అందువల్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని సూచించారు.

ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.అలాగే మిగతాజిల్లాల్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు.

ఇక ఈ ఉపరితల ద్రోణి ప్రభావం సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలపై వుండనుందని పేర్కొన్నారు. ఆ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ వెల్లడించింది.

read more  ప్రకాశం జిల్లాలో రోడ్డుప్రమాదం... నీటికాలువలోకి దూసుకెళ్లిన కారు