ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో ఓ కారు నీటికుంటలోకి దూసుకెళ్లింది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి అమాంతం రోడ్డుపక్కనున్న నీటి కాలువలో పడిపోయింది. అయితే  ప్రస్తుతం ఆ కాలువలో నీరు చాలా తక్కువగా వుండటంతో పెను ప్రమాదం తప్పింది. 

కామేపల్లి వల్లాయి కుంటలోకి కారు దూసుకెళ్లినా సగానికే నీళ్లు ఉండటంతో మునిగిపోలేదు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాపాయం నుండి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి కారులో వున్న వారిని బయటకు తీశారు.  

మిట్టపాలెంకు చెందిన ఈ ముగ్గురు కనిగిరిలో ఓ వివాహానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఎటువంటి ప్రాణ హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గ్రామస్తుల సాయంతో  ఓ ట్రాక్టర్ ను ఉపయోగించి కుంటలో నుండి వాహనాన్ని బయటకు తీశారు. 

జయప్రకాశ్ నారాయణకు తృటిలో తప్పిన ప్రమాదం