టిడిపి వీడనున్నట్లు ప్రచారం... క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి సిద్దా రాఘవరావు

తెలుగుదేశం పార్టీకి మరో మాజీ మంత్రి షాకివ్వనున్నట్లు సోషల్ మీడియాలోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ విస్తృత ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సదరు మాజీ మంత్రి ఈ విషయంపై స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. 

TDP Seniour Leader Sidda Raghavarao gives Clarity On Party changing rumors

అమరావతి: స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుండి భారీ వలసలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర టిడిపి నాయకులు కూడా వైసిపి  తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి సిద్దా రాఘవరావు కూడా టిడిపిని వీడనున్నట్లు పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది.  సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియా లో దీనిపై విస్తృతంగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో స్వయంగా రాఘవరావే దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. 

తాను తెలుగుదేశం పార్టీని వీడనున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని... తాను పార్టీమారబోనని స్పష్టం చేశారు.  వివిధ ఛానెల్స్, సోషల్ మీడియా మాద్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని... అలా వుంటే తానే స్వయంగా ప్రకటిస్తానని అన్నారు. ఇలా తనపై  జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలని రాఘవరావు విజ్ఞప్తి చేశారు.  

read more  ఆ బిజెపి నేత మాటే టిడిపిలో చెల్లుబాటు...అందుకే రాజీనామా: కేఈ ప్రభాకర్ సంచలనం

గత సార్వత్రిక ఎన్నికల్లో సిద్దా రాఘవరావు మరోసారి దర్శి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఫోటీ చేయాలని భావించారు. అయితే రాజకీయ సమీకరణల దృష్ట్యా ఆయనను ఒంగోల్ లోక్ సభ స్థానానికి ఫోటీలో నిలిపింది. అతడు దర్శి అసెంబ్లీ  టికెట్ కోసం ఎంత ప్రయత్నించినా అధిష్టానం ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో అప్పటినుండి  ఆయన పార్టీపై వ్యతిరేకతను పెంచుకున్నట్లు... ఇప్పుడు అవకాశం రావడంతో పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

స్ధానిక ఎన్నికల నేపథ్యంలో కీలకమైన టిడిపి నాయకులను తమ పార్టీలో చేర్చుకోడానికి వైసిపి నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి సిద్దా రాఘవులుతో కూడా ఒంగోలుకు చెందిన ఓ కీలక నేత ఇప్పటికే చర్చలు జరిపినట్లు ప్రచారం జరగుతోంది. త్వరలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకోడానికి రాఘవరావు సిద్దమయ్యారంటూ రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. దీనిపై మాజీ మంత్రి స్పందిస్తూ పార్టీ మారడంలేదని క్లారిటీ  ఇచ్చారు. 

read more  కడప జిల్లాలో చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ: వైసీపిలోకి మైనారిటీ నేత


 
  
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios