కడప జిల్లాలో చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ: వైసీపిలోకి మైనారిటీ నేత

కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మైనారిటీ నేత సుబాన్ భాషా టీడీపీకి రాజీనామా చేసి వైసీపిలో చేరారు. ఇప్పటికే రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డి టీడీపీని వీడారు.

TDP minority leader Subhan basha joins in YCP

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో ఎదురు దెబ్బ తగిలింది. జమ్మలమడుగుకు చెందిన సీనియర్ నేత రామసుబ్బారెడ్డి, పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి ఇప్పటికే వైసీపీలో చేరారు. తాజాగా ఓ మైనారిటీ నేత టీడీపీకి రాజీనామా చేసి వైసీపిలో చేరారు. 

టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర మైనారిటీ సెల్ మాజీ కార్యదర్శి సుబాన్ భాషా శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, కార్యదర్శి లోకేష్ ల తీరు నచ్చకనే తాను రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. 

Also Read: చంద్రబాబు భారీ ఝలక్: టీడీపీకి కేఈ ప్రభాకర్ రాజీనామా

ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా, పార్టీ కడప పార్లమెంటు అధ్యక్షుడు సురేష్ బాబుల నేతృత్వంలో సుబాన్ భాషా వైసీపిలో చేరారు. ఆయన అనుచరులు కూడా వైసీపిలో చేరారు. 

సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీని వీడడంతో తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్లే. తాజాగా సుబాన్ భాషా టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరడం గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి పెద్ద యెత్తునే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 

Alos Read: బెదిరించలేదు, స్వచ్ఛంధంగానే వైసీపీలోకి: బాబుకు రామసుబ్బారెడ్డి కౌంటర్

ప్రకాశం, విశాఖపట్నం, కడప, కర్నూలు జిల్లాల్లో టీడీపీ నేతలు రాజీనామాల బాట పడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన కూడా వైసీపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios