అమరావతి: తెలుగు దేశం పార్టీని వీడనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై  విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రత్యర్ధులు పార్టీ మారనున్నట్లు తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారని అన్నారు. తాను టిడిపి పార్టీని వీడబోనని... పార్టీ మారుతాననేది ఊహాజనితమేనని స్పష్టవ చేశారు. 

ఎవరికైనా పార్టీ మారే ఆలోచన ఉంటే వాళ్లే మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి ఉందన్నారు. కానీ మీడియా అనవసరంగా తొందరపడి కొన్ని వార్తలను స్వయంగా సృష్టిస్తోందని... అలాంటిదే తన పార్టీ మార్పు వార్తకూడా అని అన్నారు.  

read more బిజెపికి షాక్... వైసిపిలోకి గోకరాజు, ముహూర్తం ఖరారు

విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి అన్ని పార్టీల నేతల వచ్చారని తెలిపారు. అయితే టీడీపీ నేతలే ఆయన్నికలిసినట్లు చూపారని పేర్కొన్నారు. 

సుజనా చౌదరితో తాను టచ్‌లో ఉన్నానంటూ వస్తున్న వార్తలనూ గణబాబు కొట్టిపారేశారు. 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో ఉన్నారని సుజనా చౌదరి చెప్పారని... వారెవరో చెప్పాలని ఆయన్నే అడగాలన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేస్తారని మరో బిజెపి నాయకులు సోము వీర్రాజు అన్నారని...అలా అయితే చంద్రబాబు కూడా బీజేపీలోకి వెళ్లిపోతారా అని వ్యాఖ్యానించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను పార్టీ మారబోనని గణబాబు స్పష్టం చేశారు.

read more ఎన్నికల సమయంలో కాదు ఆ పని ఇప్పుడు చేయాలి: జగన్ కు పవన్ చురకలు