విజయనగరం: తమిళనాడులోని కంచిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమల యాత్రకు వెళ్లిన విజయనగరం జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 15 మందికి గాయాలయ్యాయి. 

శబరిమల నుండి కంచి వస్తుండగా.. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడిని పాచిపెంట మండల పాంచాలి గ్రామానికి చెందిన గౌరీశ్వర రావు(25)గా గుర్తించారు. మిగిలిన వారు కూడా అదే గ్రామానికి చెందినవారిగా భావిస్తున్నారు.

 read more   నారా లోకేశ్ కుట్రలు... జగన్ భద్రతకు ముప్పు: పోలీసులకు వైసిపి నేత ఫిర్యాదు

అయ్యప్ప దర్శనం చేసుకుని తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికి గౌరీశ్వర్ ప్రాణాలను కాపాడలేకపోయారు.  

ఈ దుర్ఘటనలో పాంచాలి గ్రామంలో విషాదాన్ని నింపింది. ఒకే గ్రామానికి చెందిన వారు ఇలా ప్రమాదానికి గురవడంతో పాటు ఒకరు మృతిచెందడంతో బాధిత కుటుంబాలే కాదు గ్రామస్తులందరూ కన్నీరు మన్నీరుగా విలపిస్తున్నారు. 

read more  రైతులు కాదు... చంద్రబాబుపై దాడిచేసింది పోలీసులే..: అచ్చెంనాయుడు

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఏపి పోలీసులు మృతదేహాన్ని రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.