అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరుపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గుజరాత్ వడోదరలో జరుగుతున్న ఆల్ ఇండియా పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపి పోలీసులు ఏర్పాటుచేసిన స్టాల్ ప్రధానిని అమితంగా ఆకట్టుకోవడంతో అక్కడే కాస్సేపు ఆగి వివరాలను అడిగిమరీ తెలుసుకున్నారు. 

దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు చెందిన పోలీసు శాఖల స్టాల్స్ ఏర్పాటుచేయగా మోదీని మాత్రం ఏపీ పోలీస్ స్టాల్ అమితంగా ఆకట్టుకోగలిగింది. ఇక్కడి పోలీసులు చేపట్టిన స్పందన, వీక్లీ ఆఫ్ సిస్టమ్, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ ,ఫేస్ రికక్నైజేషన్, ఈ విజిట్,  డీజీ డాష్ బోర్డ్, లాక్డ్ హౌస్ మొనిటరింగ్ సిస్టమ్ లతో స్టాల్స్ ను  ప్రధాని పరిశీలించారు.

read more  టీడీపీ మునిగిపోతుందనే...రంగంలోకి ప్యాకేజీ స్టార్:బాబు-పవన్ లపై విజయసాయిరెడ్డి ఫైర్

ఈ సందర్భంగా  ప్రత్యేక పోలీస్ విధానం, స్పందన, వీక్లీఆఫ్ సిస్టమ్ పై అక్కడే వున్న పోలీస్ అధికారులను అడిగిమరి ప్రధాని వివరాలు తెలుసుకున్నారు. స్పందన, వీక్లీ ఆఫ్‌ల పనితీరును ప్రశంసిస్తూ వాటిపై పూర్తి స్దాయిలో వివరాలు అందజేయాలని కోరారు. 

ఈ పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్ ఇవాళ ప్రధాని చేతులమీదుగా ఆరంభించబడింది. నవంబర్ నెలలో కూడా ఇది కొనసాగనుంది. అన్ని రాష్ట్రాల పోలీస్ విభాగాలు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు ఇదో మంచి వేదికగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసులు పాల్గొంటున్న ఈ ఎగ్జిబిషన్ అభిప్రాయాలను, టెక్నాలజీని పంచుకోడానికి  ఉపయోగపడుతోంది. 

read more జగన్ పాలనలో భారీ అవినీతి... స్వయంగా ఉపముఖ్యమంత్రే ఒప్పుకున్నారు...: జవహార్‌