ఆదిలాబాద్: తుపాకిని శభ్రం  చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో ఓ  కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదం సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని తిర్యాని పోలీస్‌స్టేషన్లో చోటుచేసుకుంది. 

తిర్యాని పోలీస్ స్టేషన్లో కిరణ్ కుమార్ కానిస్టేబుల్. అతడు రోజూ మాదిరిగానే ఇవాళ కూడా విధులకు హాజయ్యాడు. ఈ క్రమంలోనే స్టేషన్ లోని ఓ తుపాకీని శుభ్రం చేయడానికి పూసుకున్నాడు. ఈ క్రమంలో తుపాకీ మిస్ ఫైర్ అయి బుల్లెట్ నేరుగా కిరణ్ తలలోకి దూసుకెళ్లింది. 

read more  భార్య మేనమామను కారుతో ఢీకొట్టి, 2 కిమీ ఈడ్చుకెళ్లి చంపేశాడు

తీవ్ర రక్తస్రావమై కొనఊపిరితో కొట్టుకుంటున్న అతన్ని తోటి పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తిర్యాని ఎస్సై తెలిపారు. రోజంతా తమతో పాటు విధులు నిర్వహించిన కిరణ్ ఇలా అకస్మాత్తుగా మృతిచెందడం తీవ్ర బాధను కలిగిస్తోందని ఎస్సై అన్నారు.