Asianet News TeluguAsianet News Telugu

యువతి ప్రాణం తీసిన మెట్రో స్టేషన్... స్పందించిన అధికారులు

ఆదివారం సాయంత్రం మౌనిక అనే మహిళ.. మెట్రో స్టేషన్ లో నిలబడి ఉండగా... ఆమెపై మెట్రో పెచ్చులు ఊడిపడి ఆమె తీవ్రగాయాలపాలయ్యింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... తీవ్రగాయాలయ్యి అప్పటికే చనిపోయినట్లు అధికారులు చెప్పారు. సోదరితో పాటు సారథి స్టూడియోస్‌ సమీపానికి వచ్చిన ఆమె వర్షం ఎక్కువగా కురుస్తుండటంతో అక్కడి అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ మెట్ల కిందకు వెళ్లి ఆ ఇద్దరు నిల్చొన్నారు. 

officers response over mounika death in ameerpet metro station
Author
Hyderabad, First Published Sep 23, 2019, 9:31 AM IST

పెళ్లై కనీసం రెండు నెలలు కూడా పూర్తికాకముందే.. ఓ వధువు ప్రాణాలు కోల్పోయింది. అమీర్ పేట మెట్రో స్టేషన్ యువతి పాలిట శాపంగా మారింది. మెట్రో స్టేషన్ లో పెచ్చులూడిపడి... మౌనిక అనే యువతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటనపై ఈ రోజు మెట్రో అధికారులు స్పందించారు. మెట్రో స్టేషన్లను, పిల్లర్లను పూర్తిగా తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని మెట్రో అధికారులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 

కాగా...ఆదివారం సాయంత్రం మౌనిక అనే మహిళ.. మెట్రో స్టేషన్ లో నిలబడి ఉండగా... ఆమెపై మెట్రో పెచ్చులు ఊడిపడి ఆమె తీవ్రగాయాలపాలయ్యింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... తీవ్రగాయాలయ్యి అప్పటికే చనిపోయినట్లు అధికారులు చెప్పారు. సోదరితో పాటు సారథి స్టూడియోస్‌ సమీపానికి వచ్చిన ఆమె వర్షం ఎక్కువగా కురుస్తుండటంతో అక్కడి అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ మెట్ల కిందకు వెళ్లి ఆ ఇద్దరు నిల్చొన్నారు. అదే సమయంలో పెద్ద పెట్టున మెట్రో స్టేషన్‌ పై నుంచి పెచ్చులు ఊడిపడి ఆమెపై పడటంతో దుర్మరణం చెందింది.

ఒక్క అమీర్‌పేట సారథి స్టూడి యోస్‌ వద్ద అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లోనే కాదు.. మెట్రో దారి పొడుగునా వర్షం వస్తే వాహనచోద కులు, పాదచారులు ఆయా మెట్రో స్టేషన్‌ కిందకు పరుగులు పెడుతూ ఉంటారు. ప్రస్తుతం సారథి స్టూడియోస్‌ వద్ద అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో సంభవించిన ఘోరంపై ప్రజలు ఉలికిపాటుకు గుర య్యారు. తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. ఈ ఘటనపై మెట్రో నిర్మాణంపై ప్రజలు తీవ్ర అసహ నాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కాగా, మౌనికకు రెండు నెలల క్రితమే పెళ్లయింది. మౌనిక మృతి వార్తతో ఆ కుటుంబంలో పెను విషాదం అలుముకుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా మెట్రో స్టేషన్‌నుంచి పెచ్చులు ఊడిపడటమేంటని ప్రజానీకం ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్నారు.

read more news

రెండు నెలల క్రితమే పెళ్లి: మెట్రో స్టేషన్ పెచ్చులూడిపడి టెక్కీ మౌనిక దుర్మరణం

హైదరాబాద్ మెట్రో స్టేషన్ పెచ్చులూడిపడి లేడీ టెక్కీ మృతి (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios