వైఎస్‌ఆర్ ది ఫ్యాక్షనిజం... జగన్ ది మాత్రం సైకోయిజం...: నారా లోకేశ్

తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లపుడూ అండగా వుంటానని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. అధికార పార్టీ నాయకుల దాడులు, వేధింపులకు భయపవద్దని కార్యకర్తలకు ఆయన ధైర్యాన్ని నూరిపోశారు.   

nara lokesh fires on ys jagan at nellore

నెల్లూరు: ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారని నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. కేవలం 5 నెలల పాలనలో 
241 మంది రైతులు, 43 మంది భవన నిర్మాణ కార్మికులు, ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. 

నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ప్రజాసంక్షేమాన్ని మరిచిపోయిన ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతోందని... ఇలా వేధింపులు తట్టుకోలే ఇప్పటివరకు టిడిపికి చెందిన ఐదుగురు నాయకులు, కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. 

వైఎస్ ది ఫ్యాక్షనిజం అయితే జగన్ ది సైకోయిజమని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు 250 మంది కార్యకర్తలని చంపారని ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాకా సైకోయిజం తో కార్యకర్తలు,నాయకుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

video news : దొంగఓట్లు వేయిస్తుంటే అడ్డుపడ్డందుకే...

టిడిపి కార్యకర్తలపై కేవలం ఈ ఐదు నెలల్లోనే 690 మందిపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ దాడుల్లో 8 మంది కార్యకర్తలు చనిపోయారన్నారు. పల్నాడు ప్రాంతంలో 127 బిసి,ఎస్సి,ఎస్టీ కుటుంబాలను గ్రామాలనుండి వెలివేసిన విషయాన్ని గుర్తుచేశారు. 

ఛలో ఆత్మకూరు నిర్వహించిన తరువాత వారిని తిరిగి గ్రామాలకు చేర్చారని...వైసిపి రాజకీయ కక్ష సాధింపు కోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని లోకేశ్ పేర్కోన్నారు. ఈ 5 నెలల్లో జగన్  ప్రజలకు ఏమీ చేయకపోయినా మానవ హక్కుల సంఘం రాష్ట్రానికి వచ్చేలా చేసారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకుల పై కేసులు పెడుతూ వేధిస్తున్నారని... వారి తరపున పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

read news  70 ఏళ్ల బండి లోకేశ్ స్పీడ్ బ్రేకర్‌ను దాటలేదు: బాబుపై వంశీ తీవ్రవ్యాఖ్యలు

గుంటూరు,అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తల ఇళ్లకు అడ్డంగా వైసిపి నాయకులు గోడలు కట్టారని అన్నారు. నెల్లూరులో కూడా ఇదే జరిగిందని... దగదర్తికి చెందిన టీడీపీ కార్యకర్తని మానసికంగా వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసారని ఆరోపించారు. ఇలా మృతిచెందిన కార్తీక్ కుటుంబానికి పార్టీ తరపున 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.

అలాగే కార్తీక్ ఆత్మహత్యకి కారణమైన పోలీసు అధికారులు,వైసిపి నాయకులకు శిక్ష పడే వరకూ న్యాయపోరాటం చేస్తామన్నారు.  ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో రౌడీ రాజ్యం వచ్చిందని...పత్రికా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులపై వైసిపి నాయకులు దాడులు చేసినా కేసులు లేకుండా పోతున్నాయన్నారు.

క్రికెట్ బెట్టింగ్, డ్రగ్స్ మాఫియా అరాచకాలు ఎక్కువ అయ్యాయని... మంత్రులు,ఎమ్మెల్యేలు ఇసుక వాటాల కోసం కొట్టుకుంటున్నారని అన్నారు. టిడిపి కార్యకర్తలు దైర్యంగా ఉండాలని...అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదు, కార్యకర్తలను వేధిస్తున్న వారిపై ప్రైవేట్ కేసులు పెట్టి కోర్ట్ మెట్లు ఎక్కిస్తామని లోకేశ్ వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios