Asianet News TeluguAsianet News Telugu

అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి...వెంటనే శిక్షించిన న్యాయస్థానం

రోడ్డుపై వెళుతున్న అమ్మాయిలను వేధిస్తున్న ఓ ఆకతాయిని నంద్యాల న్యాయస్థానం శిక్షించింది. రాక్షసానందం కోసం చేసిన చిన్న పొరపాటు సదరు యువకున్ని కటకటాలపాలు  చేసింది.  

nandyala court  punished boy for eveteasing girls
Author
Nandyal, First Published Dec 3, 2019, 5:16 PM IST

కర్నూల్: అమ్మాయిలపై వేధింపులకు పాల్పడుతున్న ఓ ఆకతాయికి న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది. రోడ్డుపై వెళుతున్న యువతులను టీజ్ చేస్తూ రాక్షసానందం పొందుతున్న మహ్మద్ రఫీ శిక్షిస్తూ నంద్యాల రెండవ క్లాస్ కోర్టు రఫీకి తీర్పును వెలువరించింది. కేవలం జైలు శిక్షే కాకుండా రూ.510 రూపాయల జరిమానా కూడా విధించింది. 

నంద్యాల పట్టణం వన్ టౌన్ పరిధిలోని మహమ్మద్ రఫీ అనే యువకుడు అమ్మాయిలను టీజ్ చేస్తున్నాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన యువతులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి  దిగిన పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జైలుకు తరలించారు. 

justice for disha:ఆ మెుగుడు నాకొద్దు, ఉరితియ్యండి: దిశ హత్య కేసు నిందితుడి భార్య

ఇలా అమ్మాయిలను వేధిస్తున్న అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న నంద్యాల రెండవ క్లాస్ కోర్టు రఫీకి  15 రోజుల జైలు శిక్ష రూ.510/- రూపాయల జరిమాన విధించింది.

తాజాగా రఫీ మీద కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆకతాయిలకు చెంపపెట్టులా మారింది.ఆడపిల్లలను అల్లరి పెడుతూ ఈవ్ టీజింగ్ నేరానికి పాల్పడితే ఇంతకంటే పెద్ద శిక్షలే పడతాయని పోలీసులు తేల్చి చెబుతున్నారు. కాబట్టి అమ్మాయిల జోలికి వెళ్లకుండా వుండాలని ఆకతాయి యువకులను నంద్యాల పోలీసులు హెచ్చరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios