Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సాహిత్య ఆకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డికి మాతృవియోగం

ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి మాతృమూర్తి రత్నమ్మ కన్నుమూశారు. ఆమె ఆంత్యక్రియలు ఆదివారం స్వగ్రామం బందారంలో జరుగుతాయి. పలువురు తెలుగు సాహితీవేత్తలు ఆమె మృతికి సంతాపం ప్రకటించారు.

Nandini Sidha Reddy's mother Ratnamma dies
Author
Siddipet, First Published Sep 14, 2019, 6:55 PM IST

సిద్ధిపేట: ప్రముఖ కవి,తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ నందిని సిద్దారెడ్డి మాతృ మూర్తి  నర్ర రత్నమ్మ(85)  అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో మృతిచెందారు. ఆమె మృతదేహాన్ని వారి స్వగ్రామమైన కొండపాక మండలం బందారం గ్రామానికి తరలించారు. 

ఆదివారం ఉదయం 10 గంటలకు బందారంలో రత్నమ్మ గారి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. లంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహ రెడ్డి, కవులు శివారెడ్డి, దేవీప్రియ,  దేశపతి  శ్రీనివాస్,  వఝల శివకుమార్, బాల  శ్రీనివాసమూర్తి, బెల్లంకొండ సంపత్ కుమార్, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, పగడాల నాగేందర్, వాసిరెడ్డి నవీన్ సంతాపం వ్యక్తం చేశారు. 

తెలంగాణ ‌సాహిత్య అకాడమీ ఉద్యోగులు బాధాతప్త హృదయాలతో అంజలి ఘటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios