నందిగామలో తప్పిపోయిన బాలుడు ... జిరో ఎఫ్ఐఆర్ నమోదు
కృష్ణా జిల్లా నందిగామ డివిజన్ పోలీసులు మొదటిసారి జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఇలా తమ పరిధిలోకి రాకపోయినా ఓ బాలుడిని కాపాడటానికి కంచికచర్ల పోలీసులు ఈ పని చేశారు.
విజయవాడ: కృష్ణాజిల్లా నందిగామ సబ్ డివిజన్ పరిధిలో మొట్ట మొదటి జిరో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా మరియు నందిగామ డివిజన్ పోలీసులకు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు..
వివరాల్లోకి వెళితే... వీరులపాడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన గూగులోతు ధర్మ తేజ అనే బాలుడు తప్పిపోయాడు. దీంతో ఆ బాలుడిని వెతుక్కుంటూ హాస్టల్ వార్డెన్ మరియు బాలుని తల్లిదండ్రులు కంచికచర్ల వరకు వెళ్లారు.
ఎంత వెతికినా బాలుడి ఆచూకీ దొరక్కపోవడంతో కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీస్ సిబ్బంది ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ఫిర్యాదును స్వీకరించారు.
read more ''తెలంగాణ పోలీస్ సంస్కరణల... సీఎం, డిజిపిలపై పక్కరాష్ట్రాల ప్రశంసలు''
వాస్తవానికి ఆ కేసు వీరులపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. కానీ కంచికచర్ల పోలీస్ సిబ్బంది కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్నారు. నందిగామ డిఎస్పీ జీవి రమణమూర్తి సారధ్యంలో నందిగామ రూరల్ సీఐ సతీష్, కంచికచర్ల ఎస్సై శ్రీహరి బాబు, వీరులపాడు ఎస్సై రామగణేష్ లు రెండు బృందాలుగా ఏర్పడి బాలుడి ఆచూకీ కోసం గాలించారు.
ఎట్టకేలకు సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ మండలం వీరంపాడులో బాలుడు గుర్తించి ఆ బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 24 గంటల్లోనే మిస్సింగ్ కేసును ఛేదించిన నందిగామ డివిజన్ పోలీసులను ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.
read more బినామీ పవన్ తో చంద్రబాబు ఆడిస్తున్న నాటకమిది: సి రామచంద్రయ్య