అధికారులతో గిరిజనులకు ఇబ్బందులు...పరిష్కారానికి సీఎం ఉత్తమ సలహా: మంత్రి శ్రీవాణి

అడవుల్లో జీవించే గిరిజనులు అటవీ అధికారుల నిర్ణయాల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఉపముఖ్యమంత్రి  పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సలహాను త్వరలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.   

Minister Pamula Pushpa Srivani Speaks About Tribal Welfare

అమరావతి: అటవీశాఖ అధికారులతో గిరిజనులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారని...  అందుకోసం అటవీ అధికారులు, గిరిజనులకు మధ్య త్వరలో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని మంత్రి పాముల పుష్పశ్రీవాణి వెల్లడించారు. గిరిజన ఉత్పత్తులు, సమస్యలు, జీసీసీల పై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెబుతూ గిరిజనుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో  వివరించారు. 

సీతంపేటలో ఆంధ్రా బ్యాంకు, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా భవనాలు జీసీసీకి సంబంధించిన పార్కు స్ధలంలో ఉన్నాయా అని అడిగిన సభ్యుల ప్రశ్నకు సమాధానంగా ఆ భూమి జీసీసీకి సంబంధించినది కాదని పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. అదే విధంగా సీతంపేట ఐటిడిఏ పరిధిలో కొత్తూరు గ్రామ పరిధిలో 1210 చదరపు గజాలు ఖాలీ స్ధలం ఒకటి మాత్రమే ఉందని, దానిలో స్ధానిక గిరిజన యువతకు ఉపాధి కల్పన కోసం కావాల్సిన శిక్షణా తరగతులకు సంబంధించి ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయడం జరిగిందన్నారు.    

అదే విధంగా జీసీసీకు సంబంధించిన శాశ్వత స్ధలాలు ఎక్కడా ఆక్రమణకు గురికాలేదని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల రోడ్డు పక్కన చిన్న, చిన్న స్ధలాల్లో షాపులు పెట్టుకోవడం జరిగిందన్నారు. 

read more  అబద్దాల ప్యాక్టరీకి యజమాని తెలుగుదేశమే... వారు ప్రొడ్యూస్ చేసేదిదే: కన్నబాబు

5 అటవీ ఫల ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం మద్ధతు ధర ప్రకటించిందని... ఇంకా కొన్ని అటవీ ఉత్పత్తులకు మద్ధతు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున మరికొన్ని ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగిందని డిప్యూడీ సీఎం చెప్పారు. 

గిరిజన ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాల కోసం 2019–20 ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ కింద కొన్ని నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించామన్నారు. అందులో రూ.13.8 కోట్లతో 33 ఎల్‌పిజి గ్యాస్‌ గోడౌన్లు నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వగా, రూ.12.75 కోట్ల రూపాయలతో 17 కొత్త గోదాముల నిర్మాణం కొరకు, రూ.4.50కోట్లతో శీతల గిడ్డంగులు నిర్మాణాల మిగులు పనులు చేయుట కొరకు అడిగినట్లు తెలిపారు. 

అదే విధంగా రూ.2.88కోట్లతో 48 అసంపూర్తిగా ఉన్న డిఆర్‌ డిపోల పనులు పూర్తి చేయుట కొరకు, రూ.26.83 కోట్లతో విశాఖ పట్నంలో గిరిజన సహకార సంస్ధ ప్రధాన కార్యాలయం నిర్మాణం కొరకు ఉద్ధేశించిన ప్రతిపాదనలన్నీ నోడల్‌ ఏజెన్సీ పరిశీలనలో ఉన్నాయని వివరించారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి,  నిధుల కేటాయింపు మంజూరు కావాల్సి ఉందని సభకు తెలియజేశారు.  

అటవీశాఖ అధికారుల వల్ల గిరిజనులు ఇబ్బంది పడుతున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ..  ఈ  విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీని కోసం అటవీ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించమని సీఎం చెప్పారని,  త్వరలోనే అటవీ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం పెట్టి, గిరిజనుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. 

read more  అది ఆయన పనే... లోకేశ్‌కు సవాల్ విసిరిన మంత్రి

మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో  శిధిలావస్ధలో  ఉన్న భవనాలు మరమ్మత్తులు కోసం ప్రతిపాదనలు పెట్టి ఖచ్చితంగా వాటిని రిపేర్‌ చేయిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో సమస్యల పరిష్కరించడంతో పాటు, యానాదుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీవాణి హామీ ఇచ్చారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios