అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజుకు చేరుకున్నాయి. గత ఆరు రోజుల మాదిరిగానే ఏడోరోజు కూడా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ క్రమంలో శాసనమండలిలో ఆద్యాత్మిక కేంద్రం తిరుమలలో అన్యమత ప్రచార అంశంపై వాడివేడిగా చర్చ సాగింది. ఈ సందర్బంగా దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై సంచలన ఆరోపణలు చేశారు. 

తిరుమల  తిరుపతి దేవస్థానంలో సాగుతున్న అన్యమత ప్రచారాలపై అధికార ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై  ఒకరు విరుచుకుపడ్డారు. అయితే దీనిపై మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ... టిటిడి లో అన్యమత ప్రచారానికి కారణం చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి లోకేశేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో లోకేష్ హస్తం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. 

లోకేష్ తన టిడిపి సభ్యుల చేత సోషల్ మీడియా ద్వారా అన్యమత ప్రచారం చేయిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని స్కెచ్ వేశారని వెలంపల్లి అరోపించారు. 

read more  ఇరిగేషన్ లోనే కాదు విద్యాశాఖలోనూ రివర్స్ టెండరింగ్... ప్రకటించిన జగన్ ప్రభుత్వం

తిరుమల దేవస్థానానికి సంబంధించిన కొండపైన శిలువ వుందన్నది ఆ సోషల్‌ మీడియా క్రియేటివిటేనని అన్నారు. ఇలా సోషల్‌  మీడియా ద్వారా మత విధ్వేషాలు రెచ్చగొట్టాలని టిడిపి కుట్రపన్నిందన్నారు.  టిటిడి లో అన్యమత ప్రచారం జరిగిందనేది అవాస్తవమని... ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే టిడిపి కుట్రలు చేస్తోందన్నారు. 

తిరుమల కొండపైన శిలువ ఉందని నిరూపిస్తే తాను వెంటనే రాజీనామా చేస్తానని... కొండపైన శిలువ‌ లేకపోతే లోకేష్ రాజీనామా చేయాలని మంత్రి సవాల్ విసిరారు.తిరుమల వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేయొద్దని... ఆల్రెడీ నాశనమయ్యారు, దేవాలయాలు, తిరుమల వెంకన్న జోలికి వస్తే ఇంకా నాశనమయిపోతారని మంత్రి టిడిపికి హెచ్చరించారు. 

read more  మాజీమంత్రి అచ్చెన్నాయుడుపై వైసీపీ ప్రివిలేజ్ మోషన్

అయితే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన మంత్రి వాటిని  నిరూపించాలని లోకేశ్ సభలోనే పట్టుబట్టారు. లేదంటూ బేషరుతుగా మంత్రి వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.