కృష్ణా జిల్లా: జిల్లాలోని వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో కంటివెలుగు  కార్యక్రమం జరిగింది. గిలకలదిండిలో నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో చిన్నారులకు కంటి వెలుగు శిబిరంలో రాష్ట్ర మంత్రి పేర్ని వేంకట రామయ్య (నాని), జిల్లా కలెక్టర్ ఎఎండి. ఇంతియాజ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... చిన్నారులకు చిన్న, పెద్ద కంటి సమస్యలు/లోపాలు ఏమైనా ఉంటే మొదటి విడత కార్యక్రమం పరీక్షలు నిర్వహిస్తారన్నారు. నవంబర్ 1 వ తేదీ నుండి డిసెంబర్ 30 తేదీ లోపు చిన్న లోపాలైతే స్థానికంగా ఉండే ఆసుపత్రుల్లో చికిత్సలు, పెద్ద లోపాలైతే ఎల్.వి.ప్రసాద్, శంకర్ నేత్రాలయం, రోటరీ క్లబ్ ఉయూరు తదితర ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే వారితో మాట్లాడటం జరిగిందన్నారు. 

డిసెంబర్ మాసాంతరానికి దృష్టి లోపాలు ఉన్న పిల్లలకు సమస్యలు పరిష్కారం కృషి చేస్తున్న కలెక్టర్ సఫలీకృతం కావాలి. జిల్లాలో ఉన్న ప్రతి పిల్లవాడి దృష్టి లోపం సరి చేయ్యాలన్న సిఎం జగన్మోహన్ రెడ్డి ఆశయం నిరవేరాలన్నారు.ఈ కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ మూర్తి, డి.ఈ. ఓ. రాజ్యలక్ష్మి, డి.సి.హెచ్.ఎస్ కిరణ్మయి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.