ఉల్లి కొరతను ముందే జగన్ పసిగట్టారు... అందువల్లే ఈ పరిస్థితి: మోపిదేవి

ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న ఉల్లి కొరతపై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ మొదలయ్యింది. దీన్ని మార్కెటింగ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు.    

Minister Mopidevi Venkata Ramana talks on assembly about Onion Crisis

అమరావతి: ఈ ఏడాది సెప్టెంబరు నెల మధ్య నుంచే ఉల్లి ధర క్రమంగా పెరుగుతూ వస్తోందని మార్కెటింగ్‌ శాఖ మంత్రి  మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అప్పుడే ఈ అంశాన్ని గమనించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని తమకు ఆదేశించారని పేర్కొన్నారు. కాబట్టే దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపిలోని సబ్సిడీపై ప్రజలకు ఉల్లిపాయలు  అందిస్తున్నామని అన్నారు. 

ఉల్లి ధరలపై అసెంబ్లీలో స్వల్ప వ్యవధి చర్చను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 2 వరకు మొదటి విడతలో మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ ఫండ్‌ ద్వారా కిలో ఉల్లి రూ.25కే సరఫరా చేశామని తెలిపారు. అప్పుడు 6,731 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేశామన్నారు. 

ఇక నవంబరు 14 నుంచి మళ్లీ ఉల్లి ధరలు పెరిగాయని... అప్పుడు కూడా  ముఖ్యమంత్రి నిర్ణయం, ఆదేశం మేరకు ఇతర ప్రాంతాల నుంచి ఉల్లి కొనుగోలు చేసి కిలో ఉల్లి రూ.25కే ప్రజలకు సరఫరా చేశామని... ఇప్పటికీ చేస్తూనే ఉన్నామన్నారు.  ఆ విధంగా ఇప్పటి వరకు 38 వేల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి రాష్ట్రంలోని 101 రైతుబజార్లలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.

read more జగన్ కు కౌంటర్: హెరిటేజ్ గ్రూప్ తో మాకు సంబంధం లేదన్న నారా భువనేశ్వరి 

సబ్సిడి ధరలకు ఉల్లి అందిచడంపై వ్యవసాయ మిషన్, మార్కెటింగ్‌ శాఖ అధికారులు నాలుగు పర్యాయాలు సమావేశమయ్యారని తెలిపారు. ఈ నెల 5న అత్యధికంగా కేజీ ఉల్లి బయటి మార్కెట్‌లో రూ.120 కి కొనుగోలు చేసి వినియోగదారులకుకేవలం రూ.25కే సరఫరా చేశామన్నారు.

సహజంగానే ఈ ఏడాది దేశంలో అత్యధిక వర్షాలు కురిశాయి. సరిగ్గా ఉల్లి పంట చేతికొచ్చే సమయంలోనే ఇది జరగడంతో పంట పాడయిపోయి దిగుబడి తగ్గింది. ముందే ఈ  ఏడాది ఉల్లి సాగు బాగా తగ్గగా అధిక వర్షాలు ఉన్న కాస్త పంటను నాశనం చేశాయని అన్నారు. 

read more స్మశానంలా రాజధాని అమరావతి...అన్నది నిజమే, కానీ..: అసెంబ్లీలో బొత్స

రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద ఉల్లి ధరలు పెరిగాయి అయినా కిలో ఉల్లి రూ.25కే వినియోగదారులకు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మేరకు ఉల్లి కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామని... ఇలా సబ్సిడిపై ఉల్లిని అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios