అమరావతి: హెరిటేజ్ కంపెనీపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.

హెరిటేజ్ కంపెనీకి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హెరిటేజ్ తమ కంపెనీ అంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు నారా భువనేశ్వరి. రాష్ట్రంలో ఉల్లిధరలు ఇంతలా పెరిగిపోవడం తన జీవితంలో ఏనాడూ చూడలేదని చెప్పుకొచ్చారు. ఒక సాధారణ గృహిణిగా ఉల్లిధర పెరగడం సమర్థించనన్నారు. ఉల్లి సమస్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని పరిష్కరించాలని కోరారు. 

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హెరిటేజ్ లో రూ.200 కిలో ఉల్లి అమ్ముతున్నారని చెప్పారని ఆమె గుర్తు చేశారు. హెరిటేజ్ గ్రూప్ తో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫ్యూచర్ గ్రూప్ తోనే హెరిటేజ్ నడుస్తుందని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. 

Ap Assembly: అసెంబ్లీలో స్పీకర్ తో చంద్రబాబు వాగ్వాదం... టీడీపీ నేతల వాకౌట్

ఇకపోతే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలిరోజు ఉల్లిధరలపై అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. ఉల్లిఘాటుపై చర్చించాలంటూ తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది. ఉల్లిధరలు ఆకాశాన్నంటుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆరోపించారు. 

ఉల్లిధరలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఉల్లిధరలను అదుపులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం రూ.25కే కిలో ఉల్లిపాయలను రైతు బజార్లలో అందిస్తున్నట్లు తెలిపారు. 

అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన హెరిటేజ్ కంపెనీస్ లో కిలో ఉల్లి రూ.200కు అమ్ముతున్నారంటూ సీఎం జగన్ ఆరోపించారు. జగన్ తోపాటు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా హెరిటేజ్ కంపెనీపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

పిచ్చాస్పత్రిలో చేర్చినా మీరు మారరు: టీడీపీపై జగన్ ధ్వజం