మంగళగిరి: మహిళా సంరక్షణ కోంసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దిశా యాక్ట్ ను తీసుకువచ్చింది. ఇదివరకే ఈ బిల్లుకు సీఎం జగన్ సారథ్యంలోని మంత్రిమండలి ఆమోదించగా శుక్రవారం అసెంబ్లీ ఆమోదాన్ని కూడా  పొందింది. ఇలా మహిళలపై జరుగులతున్న అఘాయిత్యాలను అడ్డుకోడానికి నిబద్దతతో పనిచేస్తూ కఠిన చట్టాలను తీసుకువచ్చి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర మహిళా లోకం ప్రశంసలు కురిపిస్తోంది. 

ఈ క్రమంలో  రాజధాని ప్రాంతమైన మంగళగిరి పట్టణంలో స్థానిక మహిళలు జగన్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. పట్టణంలోని  అంబేద్కర్ విగ్రహం వద్ద గుమిగూడిన మహిళలు సంబరాలు చేసుకున్నారు. 

మేకవన్నె పులినే ప్రజలు నమ్మారు... ఇప్పుడు వారికి అర్థమవుతోంది: కళా వెంకట్రావు

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో మహిళ రక్షణకు తొలి అడుగులు పడటం హర్షణీయమమన్నారు. ఇకపై నిర్భయంగా, స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నామని అన్నారు.

దిశ యాక్ట్ ద్వారా చట్టాలను సవరించడంతో పాటు విచారణ సమయాన్ని తగ్గించి అత్యాచార ఘటనల్లో నిందితులకు 21 రోజుల్లో కఠిన శిక్షలు పడేలా అసెంబ్లీలో బిల్లు  తీసుకురావటం సంతోషకరమన్నారు.మహిళలు చిన్నారులపై, లైంగిక వేధింపులకు పాల్పడితే భయం కల్పించే విధంగా చట్టాలు  తీసుకు రావటంపై వారు  హర్షం వ్యక్తం చేశారు.

read more రాజధాని మార్పుపై క్లారిటీ... మంత్రి బొత్స లిఖితపూర్వక ప్రకటన

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ, సుబాని, సురేష్, ఖాదిరి, ఫారుఖ్, మూసా, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిశా యాక్ట్ పై అవగాహన పొందారు. వైసిపి నాయకులు మహిళలకు  దిశా యాక్ట్ లో పొందుపర్చిన విషయాలను మహిళలకు వివరించారు.